రేస్‌లో పాల్గొన్న అతికా మీర్
‘రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్’ ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ స్థాయి గోకార్ట్ రేసింగ్. 7 నుంచి 15 ఏళ్ల లోపు వయసు పిల్లలు అనేక దేశాల నుంచిపాల్గొంటారు. 9 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల ‘మైక్రో మ్యాక్స్’ రేస్‌లో ఈసారి విజేతగా నిలిచింది మన కశ్మీర్ చిన్నారి అతికా మీర్. దాదాపు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గోకార్ట్ నడుపుతూ డ్రైవింగ్ మెళకువలు ప్రదర్శిస్తూ ఈ విజయం సాధించింది. మోటర్‌స్పోర్ట్స్ చరిత్రలో గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో రేస్ గెలిచిన ఫస్ట్–ఫిమేల్ రేసర్‌గా చరిత్ర సృష్టించింది అతికా మీర్..
ప్రతిష్ఠాత్మకమైన రోటాక్స్ మాక్స్ ఛాలెంజ్(ఆర్‌ఎంసీ) ఇంటర్నేషనల్ ట్రోపీలో మైక్రో మాక్స్ కేటగిరీ రేస్ 2లో అతికా మీర్ విజయం సాధించింది. గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్(ఫ్రాన్స్)లోపాల్గొనడం మీర్‌కు ఇదే తొలిసారి. ముందస్తు ప్రాక్టీస్ లేక΄ోయినప్పటికీ కొత్త బ్రాండ్ కార్ట్‌ను వేగంగా ఎడాప్ట్ చేసుకొని తన ప్రతిభ చాటుకుంది. రోటాక్స్ మాక్స్ చాలెంజ్ ప్రతిష్ఠాత్మకమైన రేస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన కార్ట్ డ్రైవర్స్‌కు వేదిక. రేస్ 2లో అతికా విజయాన్ని ‘స్పీడ్ అండ్ స్ట్రాటజీ’కి సంబంధించి మాస్టర్‌క్లాస్ అంటున్నారు విశ్లేషకులు.
‘రేస్ విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. యూరప్‌లో ఇది నా తొలి విజయం. ఈ విజయం కోసం చాలా శ్రమ పడ్డాను. నా టీమ్ ఎంతో సహకారాన్ని అందించింది. నా తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం నాకెంతో బలం’ అంటుంది అతికా మీర్. దుబాయ్‌లోని మాల్స్‌లో మీర్ సరదాగా ఎలక్ట్రిక్ కార్లు నడిపేది. మీర్ డ్రైవింగ్ స్కిల్స్‌ను చూసి తండ్రితో సహా మాల్‌లో ఉన్న వాళ్లు ముక్కున వేలేసుకునేవారు. మీర్ తండ్రి ఆసిఫ్ నజీర్ మీర్ మన దేశ తొలి నేషనల్ కార్టింగ్ ఛాంపియన్. డ్రైవింగ్‌కు సంబంధించి తండ్రి ఇచ్చిన రకరకాల టైమ్ చాలెంజ్‌లను బీట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేది మీర్.
‘ఇక టైమ్ వృథా చేయవద్దు. మీర్‌ను కార్టింగ్ ప్రపంచంలోకి తీసుకురా వాల్సిందే’ అనుకున్నాడు ఆసిఫ్ నజీర్. ఇక ఆరోజు నుంచి మీర్‌లో కార్టింగ్‌పై మొదలైన ఇష్టం అంతకంతకూ పెరుగుతూ ΄ోయింది. ఫిట్‌నెస్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫార్ములా వన్‌లో విజయకేతనం ఎగరేసి చరిత్ర సృష్టించాలని కల కనేలా చేసింది.
ఆరు సంవత్సరాల వయసులో ఎఫ్‌ఐఏ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ అండ్ యంగెస్ట్ ఫిమేల్ డ్రైవర్‌గా రికార్డ్ సృష్టించింది. మీర్ తొలి ఫుల్ సీజన్ రేసింగ్ యూఏయిలో జరిగిన మినీ ఆర్ కేటగిరితో మొదలైంది. ఈ రేస్‌లో వైస్–చాంపియన్ టైటిల్ గెలుచుకుంది.
వచ్చే ఆగస్ట్‌లో మీర్ యూకేలోని వరల్డ్–ఫేమస్ ‘కార్ట్‌మాస్టర్స్’లో డ్రైవింగ్ చేయనుంది. ఇటలీలోని ఐరన్ డేమ్స్ యంగ్ టాలెంట్ ఈవెంట్‌కు కూడా ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ΄ోటీకి ఎంపికైన 11 మంది బాలికలలో ఆసియా నుంచి ఎంపికైన ఏకైక బాలిక మీర్. ‘రేస్‌కు ముందు నెర్వస్‌గా ఉంటాను. కారులో కూర్చున్న తరువాత మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఎలాగైనా ఈ రేస్‌లో గెలవాల్సిందే అనే పట్టుదల పెరుగుతుంది. భయాలు కొట్టుకు΄ోతాయి’ అంటుంది మెరిసే కళ్లతో అతికా మీర్. ఈ చిన్నారి భవిష్యత్‌లో ఎన్నెన్ని మెరుపులు మెరిపించనుందో వేచిచూద్దాం!
Comments
Please login to add a commentAdd a comment