Kashmiri girl
-
నిజమే..! తాను తొమ్మిదేళ్ల సూపర్ రేసర్!!
‘రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్’ ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ స్థాయి గోకార్ట్ రేసింగ్. 7 నుంచి 15 ఏళ్ల లోపు వయసు పిల్లలు అనేక దేశాల నుంచిపాల్గొంటారు. 9 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల ‘మైక్రో మ్యాక్స్’ రేస్‌లో ఈసారి విజేతగా నిలిచింది మన కశ్మీర్ చిన్నారి అతికా మీర్. దాదాపు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గోకార్ట్ నడుపుతూ డ్రైవింగ్ మెళకువలు ప్రదర్శిస్తూ ఈ విజయం సాధించింది. మోటర్‌స్పోర్ట్స్ చరిత్రలో గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రేస్ గెలిచిన ఫస్ట్–ఫిమేల్ రేసర్‌గా చరిత్ర సృష్టించింది అతికా మీర్..ప్రతిష్ఠాత్మకమైన రోటాక్స్ మాక్స్ ఛాలెంజ్(ఆర్ఎంసీ) ఇంటర్నేషనల్ ట్రోపీలో మైక్రో మాక్స్ కేటగిరీ రేస్ 2లో అతికా మీర్ విజయం సాధించింది. గోకార్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్(ఫ్రాన్స్)లోపాల్గొనడం మీర్‌కు ఇదే తొలిసారి. ముందస్తు ప్రాక్టీస్ లేక΄ోయినప్పటికీ కొత్త బ్రాండ్ కార్ట్‌ను వేగంగా ఎడాప్ట్ చేసుకొని తన ప్రతిభ చాటుకుంది. రోటాక్స్ మాక్స్ చాలెంజ్ ప్రతిష్ఠాత్మకమైన రేస్. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన కార్ట్ డ్రైవర్స్‌కు వేదిక. రేస్ 2లో అతికా విజయాన్ని ‘స్పీడ్ అండ్ స్ట్రాటజీ’కి సంబంధించి మాస్టర్‌క్లాస్ అంటున్నారు విశ్లేషకులు.‘రేస్ విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. యూరప్‌లో ఇది నా తొలి విజయం. ఈ విజయం కోసం చాలా శ్రమ పడ్డాను. నా టీమ్ ఎంతో సహకారాన్ని అందించింది. నా తల్లిదండ్రుల ్ర΄ోత్సాహం నాకెంతో బలం’ అంటుంది అతికా మీర్. దుబాయ్‌లోని మాల్స్‌లో మీర్ సరదాగా ఎలక్ట్రిక్ కార్లు నడిపేది. మీర్ డ్రైవింగ్ స్కిల్స్‌ను చూసి తండ్రితో సహా మాల్లో ఉన్న వాళ్లు ముక్కున వేలేసుకునేవారు. మీర్ తండ్రి ఆసిఫ్ నజీర్ మీర్ మన దేశ తొలి నేషనల్ కార్టింగ్ ఛాంపియన్. డ్రైవింగ్‌కు సంబంధించి తండ్రి ఇచ్చిన రకరకాల టైమ్ చాలెంజ్‌లను బీట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేది మీర్.‘ఇక టైమ్ వృథా చేయవద్దు. మీర్‌ను కార్టింగ్ ప్రపంచంలోకి తీసుకురా వాల్సిందే’ అనుకున్నాడు ఆసిఫ్ నజీర్. ఇక ఆరోజు నుంచి మీర్‌లో కార్టింగ్పై మొదలైన ఇష్టం అంతకంతకూ పెరుగుతూ ΄ోయింది. ఫిట్నెస్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫార్ములా వన్‌లో విజయకేతనం ఎగరేసి చరిత్ర సృష్టించాలని కల కనేలా చేసింది.ఆరు సంవత్సరాల వయసులో ఎఫ్ఐఏ ఇంటర్నేషనల్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న ఫస్ట్ అండ్ యంగెస్ట్ ఫిమేల్ డ్రైవర్‌గా రికార్డ్ సృష్టించింది. మీర్ తొలి ఫుల్ సీజన్ రేసింగ్ యూఏయిలో జరిగిన మినీ ఆర్ కేటగిరితో మొదలైంది. ఈ రేస్‌లో వైస్–చాంపియన్ టైటిల్ గెలుచుకుంది.వచ్చే ఆగస్ట్‌లో మీర్ యూకేలోని వరల్డ్–ఫేమస్ ‘కార్ట్మాస్టర్స్’లో డ్రైవింగ్ చేయనుంది. ఇటలీలోని ఐరన్ డేమ్స్ యంగ్ టాలెంట్ ఈవెంట్‌కు కూడా ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ΄ోటీకి ఎంపికైన 11 మంది బాలికలలో ఆసియా నుంచి ఎంపికైన ఏకైక బాలిక మీర్. ‘రేస్‌కు ముందు నెర్వస్‌గా ఉంటాను. కారులో కూర్చున్న తరువాత మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. ఎలాగైనా ఈ రేస్‌లో గెలవాల్సిందే అనే పట్టుదల పెరుగుతుంది. భయాలు కొట్టుకు΄ోతాయి’ అంటుంది మెరిసే కళ్లతో అతికా మీర్. ఈ చిన్నారి భవిష్యత్‌లో ఎన్నెన్ని మెరుపులు మెరిపించనుందో వేచిచూద్దాం! -
ఇప్పుడవి రాళ్లు విసిరే చేతులు కాదు
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి.ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్‌బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రోఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్.ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు.యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్‌బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమిప్రోఫెషనల్ స్టోన్ పెల్టర్‌ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్‌బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ్రపోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలి ప్రోఫెషనల్ ఫిమేల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్‌బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మాప్రాంంతం నుంచి ఫుట్‌బాల్‌లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్‌లో ఆడాను. గోల్ కీపర్‌గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మాప్రాంంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్‌బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్‌ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. -
ఆయేషా లక్ష్యం.. ఆకాశమే!
అరుదైన ఘనతను సాధించేందుకు సిద్ధమవుతున్న కశ్మీరీ యువతి జమ్ము: ఆయేషా అజీజ్ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకుంటోంది. త్వరలోనే పైలట్‌గా యుద్ధవిమానాన్ని నడుపబోతోంది. గతవారమే పైలట్‌గా కమర్షియల్ లైసెన్స్ పొందిన ఈ 21ఏళ్ల కశ్మీర్ యువతి.. త్వరలో మిగ్–29 యుద్ధవిమానంలో దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. రష్యాలోని సొకుల్ ఎయిర్‌బేస్‌లో జరిగే ఈ పరీక్షలో ఆయేషా సఫలీకృతమైతే మిగ్–29 యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయ యువతిగా ఆయేషా ఘనత సాధిస్తుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆకాశపు అంచులదాఆయేషా అజీజ్ పైలట్కశ్మీర్ యువతికా దూసుకెళ్లాలనుకుంటున్నా. అందుకే రష్యాలో మిగ్–29 యుద్ధ విమానాన్ని నడిపేందుకు సిద్ధమవుతున్నా. జెట్ ఫైటర్‌ను నడపడానికి ఉవ్విళ్లూరుతున్నా’నని చెప్పింది. పాఠశాలలో ఉన్నప్పుడే పైలట్‌కు అవసరమైన శిక్షణ కార్యక్రమాల్లో ఆయేషా పాల్గొనేది. దీంతో 16 సంవత్సరాలకే బాంబే ఫ్లయింగ్ క్లబ్ ఆమెకు స్టూడెంట్ పైలట్ లైసెన్స్ ఇచ్చింది. 2012లో నాసా నిర్వహించిన రెండు నెలల అడ్వాన్స్డ్ స్పైస్ ట్రెయినింగ్‌ను కూడా ఆయేషా పూర్తిచేసింది. ఈ శిక్షణకు ఎంపికైన ముగ్గురు భారతీయుల్లో ఆయేషా ఒకరు. సునీతా విలియమ్స్ తనకు స్ఫూర్తి అని చెప్పే ఆయేషా.. అంతటి కీర్తిప్రతిష్టలను సాధించాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది. జమ్ములోని బారాముల్లా జిల్లాకు చెందిన ఆయేషా తండ్రి ముంబై వాసి. తన కూతురు సాధిస్తున్న విజయాలను చూస్తూ మురిసిపోతున్న ఆయన ఆయేషా గురించి మాట్లాడుతూ.. ‘నా కూతురు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే గర్వంగా ఉంది. మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మేమంతా కోరుకుంటున్నామ’న్నారు. ఆయేషా సోదరుడు ఆరీబ్ లోఖండ్వాలా మాట్లాడుతూ... ‘అక్కే నాకు రోల్‌మోడల్. ఆమె సాధిస్తున్న విజయాలు నాకెన్నో లక్ష్యాలను నిర్దేశిస్తున్నాయి. తప్పకుండా అక్క చూపిన బాటలోనే నడుస్తాన’న్నాడు. కశ్మీర్‌లోని పరిస్థితులు ఏవీ తన లక్ష్యానికి అడ్డురాలేదని, మిగతా బాలికలు కూడా లక్ష్యంపై గురిపెట్టి విజయాలు సాధించాలని తాను కోరుకుంటున్నానని ఆయేషా చెప్పింది. -
ప్రపంచ కిక్ బాక్సింగ్‌లో మెరిసిన కశ్మీరం
ఇటలీలో జరిగిన ప్రపంచ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కశ్మీర్ అమ్మాయి తాజముల్ ఇస్లాం మెరిసింది. అండర్-8 కేటగిరిలో ఈ అమ్మాయి స్వర్ణ పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి కశ్మీరీగా రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో ఇస్లాం.. అమెరికా అమ్మాయిని ఓడించి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో 90 దేశాలు పాల్గొన్నాయి. కశ్మీర్లో బండిపొరా జిల్లాలోని తార్క్పొరా గ్రామానికి చెందిన ఇస్లాం రెండో తరగతి చదువుతోంది. పలు టోర్నీలలో పతకాలు సాధించింది. జమ్ము కశ్మీర్ వుషు చాంపియన్‌షిప్, జాతీయ సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో ఇస్లాం బంగారు పతకాలు గెలిచింది. చిన్నతనం నుంచే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న ఇస్లాం కశ్మీరీల మన్నలు అందుకుంటోంది. -
కశ్మీరీ యువతికి చేదు అనుభవం
న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఓ మెడికల్ విద్యార్థినికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఆమెకు అకారణంగా చుక్కలు చూపించారు. ఆమె లగేజీలో బాంబు ఉందని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. ఢాకా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఆమెకు ఢాకా, కోల్‌కతా విమానాశ్రయాల్లో లగేజ్ చెకింగ్ అధికారులు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ఢిల్లీలో మాత్రం బాంబు ఉందంటూ అదుపులోకి తీసుకోవటంతో ఆమె షాక్‌కు గురైంది. ఆమెతో ఉన్న ముగ్గురు మిత్రులు సైతం దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ ఫ్రెండ్‌ను వదిలేసిన తరువాతే మేమూ వెళ్తామంటూ విమానాశ్రయంలో భీష్మించుకు కూర్చున్నారు. కొన్ని గంటల పాటు ప్రశ్నించిన తరువాత అధికారులు ఆమెను వదిలేశారు. అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలుపకపోవటంతో ఆమె తండ్రి ఎయిర్ పోర్ట్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి రాజనాథ్ సింగ్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో వారు ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్‌ను మిస్సయ్యారు.