ప్రపంచ కిక్ బాక్సింగ్‌లో మెరిసిన కశ్మీరం
ఇటలీలో జరిగిన ప్రపంచ కిక్ బాక‍్సింగ్ చాంపియన్‌షిప్‌లో కశ్మీర్ అమ్మాయి తాజముల్ ఇస్లాం మెరిసింది. అండర్-8 కేటగిరిలో ఈ అమ్మాయి స్వర్ణ పతకం సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి కశ్మీరీగా రికార్డు నెలకొల్పింది.
ఫైనల్లో ఇస్లాం.. అమెరికా అమ్మాయిని ఓడించి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో 90 దేశాలు పాల్గొన్నాయి. కశ్మీర్‌లో బండిపొరా జిల్లాలోని తార్క్‌పొరా గ్రామానికి చెందిన ఇస్లాం రెండో తరగతి చదువుతోంది. పలు టోర్నీలలో పతకాలు సాధించింది. జమ్ము కశ్మీర్ వుషు చాంపియన్‌షిప్, జాతీయ సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో ఇస్లాం బంగారు పతకాలు గెలిచింది. చిన్నతనం నుంచే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తున్న ఇస్లాం కశ్మీరీల మన్నలు అందుకుంటోంది.