anindit
-
శ్రియా-అనిన్దిత్ పెళ్లి వేడుక
-
శ్రియా-అనిన్దిత్ పెళ్లి వేడుక, స్టార్ల హంగామా
అక్కినేని వారింట చిన్న కోడలుగా అడుగపెట్టబోయే చివరి నిమిషంలో ఆగిపోయిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ పెళ్లి అయింది. హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కజిన్ అనిన్దిత్రెడ్డితో ఆమె వివాహం జరిగింది. వీరి వివాహానికి రామ్ చరణ్ నుంచి మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ వరకు టాలీవుడ్ స్టార్లందరూ హాజరయ్యారు. శ్రియా, అనిన్దిత్ పెళ్లి వేడుకకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి కూతురు శ్రియా భూపాల్, అద్భుతమైన వజ్రాల నెక్లెస్‌తో తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన చీరలో మెరిసిపోయింది. పెళ్లి కొడుకు అనిన్దిత్, క్లాసిక్ శెర్వానీతో సింపుల్ లుక్‌లో కనిపించాడు. ఉపాసనకు అనిన్దిత్ కజిన్ కాగ, శ్రియా వదిన దియా, నమ్రతా శిరోద్కర్‌కు క్లోజ్ ఫ్రెండ్. నమ్రతా పిల్లలతో పాటు ఈ వివాహానికి హాజరయ్యారు. సానియా మిర్జా, ప్రజ్ఞా జైస్వాల్, లావణ్యలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. కాగ, శ్రియా భూపాల్‌కు అంతకముందు నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌తో నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. ఏమైందో ఏమో కానీ ఇరువురి వివాహం ఆఖరి నిమిషాల్లో ఆగిపోయింది. అఖిల్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ కావడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై ఇరు కుటుంబాలు పెద్దగా స్పందించకపోగా.. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద హాట్టాఫిక్ కూడా మారింది. శ్రీయా భూపాల్ ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మనవరాలు. ప్రస్తుతం అఖిల్ పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టేసి, సినిమాలపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. -
శ్రియా భూపాల్ నిశ్చితార్థం
శ్రియా భూపాల్ ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. జీవీకే కుటుంబానికి చెందిన ఆమె...అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి... జస్ట్ మిస్ అయింది. ప్యాషన్ డిజైనర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శ్రియా.. అక్కినేని అఖిల్‌తో నిశ్చితార్థం జరగడం తర్వాత క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అఖిల్ తన కెరీర్‌పై దృష్టి పెట్టి పెట్టాడు. ఈ బ్రేకప్ తర్వాత శ్రియా భూపాల్..అనిందిత్తో ప్రేమలో ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ శ్రియా, అనిందిత్ల నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరి బంధువు పింకీ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనిందిత్ గురించి: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతల కుమారుడు అనిందిత్. సంగీత, ఉపాసన తల్లి శోభన అక్కాచెల్లెల్లు. అంటే ఉపాసనకు అనిందిత్‌కు సోదరుడు అన్నమాట. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసనలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వీరి వివాహం పారిస్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Lovely evening! Best wishes to #shriyaanindith. #shriyabhupal #shriyasom #happytime #goodtimes #instagood #pinkyreddy #friends #family A post shared by Pinky Reddy (@pinkyreddyofficial) on Apr 21, 2018 at 9:21pm PDT -
చాంపియన్ అనిందిత్
సాక్షి, హైదరాబాద్: యూరో జేకే–17 ఫార్ములా రేసింగ్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్ రేసర్ అనిందిత్ రెడ్డి సత్తా చాటాడు. వరుసగా రెండోసారి విజేతగా నిలిచి టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. ఢిల్లీలో జరిగిన ఈ రేసును అనిందిత్ 2ని.4.792 సెకన్లలో పూర్తిచేసి చాంపియన్‌గా నిలిచాడు. నయన్ సి చటర్జీ, విష్ణు ప్రసాద్ వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. ఇప్పటివరకు అనిందిత్ పోలో వెంట్ చాంపియన్‌షిప్‌ను ఒకసారి... ఎంఆర్ఎఫ్–బీఎండబ్ల్యూ చాంపియన్‌షిప్, జేకే టైర్స్ చాంపియన్‌షిప్‌లను రెండుసార్లు చొప్పున గెలుచుకున్నాడు. -
మూడో స్థానంలో అనిందిత్
సాక్షి, హైదరాబాద్: జేకే టైర్ ఎఫ్ఎంఎస్సీఐ నేషనల్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ రేసర్ అనిందిత్ రెడ్డి మెరిశాడు. కోయంబత్తూర్‌లో జరుగుతోన్న ఈ ఈవెంట్ రెండో రౌండ్లో ఒక రేసులో విజేతగా నిలిచి ఓవరాల్‌గా యూరో జేకే–17 విభాగంలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. రేస్–2లో నాలుగో స్థానం నుంచి ప్రారంభించిన అనందిత్ విజేతగా నిలిచాడు. తొలి రేసులో రికీ కాపో గెలిచాడు. ఓవరాల్‌గా జేకే–17 విభాగంలో తొలిరోజు ముగిసేసరికి నయన్ చటర్జీ , రికీ కాపో, అనందిత్ రెడ్డి వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఎల్జీబీ ఫార్ములా 4 కేటగిరీలో చిత్తేశ్ (డార్క్డాన్ రేసింగ్), రోహిత్ ఖన్నా (డార్క్ డాన్ రేసింగ్), రఘుల్ రంగసామి (ఎంస్పోర్ట్)... సుజుకి గిజ్జర్ కప్ విభాగంలో జోసెఫ్ (చెన్నై), సంజీవ్ (ముంబై), లల్మావిపువియా (ఐజ్వాల్)... రెడ్‌బుల్ రికీ కప్‌లో జాడెన్ గుణవర్దెనా, లాల్హురియజెలా, లాల్నన్సంగ వరుసగా తొలి మూడు స్థానాలను సాధించారు. -
రేసింగ్ చాంప్ అనిందిత్
సాక్షి, హైదరాబాద్: జేకే టైర్ ఎఫ్ఎంఎస్సీఐ జాతీయ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాదీ రేసర్ అనిందిత్ రెడ్డి సత్తా చాటాడు. ఢిల్లీలోని బుధ్ సర్క్యూట్లో జరిగిన ఈ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో యూరో జేకే-16 విభాగంలో విజేతగా నిలిచాడు. ఆరో స్థానం నుంచి రేసును ప్రారంభించిన అనిందిత్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించాడు. చివరి వరకు తన దూకుడును కొనసాగిస్తూ 116 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విభాగంలో అనంత్ షణ్ముగమ్ (99 పాయింట్లు), నయన్ చటర్జీ (90 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు ఎల్జీబీ-4 రేసు విభాగంలో చెన్నైకి చెందిన విష్ణు ప్రసాద్ (96 పాయింట్లు) విజేతగా నిలవగా... రాహుల్ రంగస్వామి (75 పాయింట్లు), శరణ్ (54 పాయింట్లు) తర్వాతి స్థానాల్ని దక్కించుకున్నారు.