శ్రియా-అనిన్‌దిత్‌ పెళ్లి వేడుక, స్టార్ల హంగామా | Shriya Bhupal And Anindith Reddy Wedding | Sakshi
Sakshi News home page

శ్రియా-అనిన్‌దిత్‌ పెళ్లి వేడుక, స్టార్ల హంగామా

Published Sat, Jul 7 2018 3:02 PM | Last Updated on Sat, Jul 7 2018 4:29 PM

Shriya Bhupal And Anindith Reddy Wedding - Sakshi

శ్రియా భూపాల్‌ - అనిన్‌దిత్‌ రెడ్డి వేడుక

అక్కినేని వారింట చిన్న కోడలుగా అడుగపెట్టబోయే చివరి నిమిషంలో ఆగిపోయిన ఫ్యాషన్‌ డిజైనర్‌  శ్రియా భూపాల్‌ పెళ్లి అయింది. హీరో రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కజిన్‌ అనిన్‌దిత్‌రెడ్డితో ఆమె వివాహం జరిగింది. వీరి వివాహానికి రామ్‌ చరణ్‌ నుంచి మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ వరకు టాలీవుడ్‌ స్టార్లందరూ హాజరయ్యారు.  శ్రియా, అనిన్‌దిత్‌ పెళ్లి వేడుకకు సంబంధించి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పెళ్లి కూతురు  శ్రియా భూపాల్‌, అద్భుతమైన వజ్రాల నెక్లెస్‌తో తరుణ్‌ తహిలియానీ డిజైన్‌ చేసిన చీరలో మెరిసిపోయింది. పెళ్లి కొడుకు అనిన్‌దిత్‌, క్లాసిక్‌ శెర్వానీతో సింపుల్‌ లుక్‌లో కనిపించాడు.

ఉపాసనకు అనిన్‌దిత్‌ కజిన్‌ కాగ, శ్రియా వదిన దియా, నమ్రతా శిరోద్కర్‌కు క్లోజ్‌ ఫ్రెండ్‌. నమ్రతా పిల్లలతో పాటు ఈ వివాహానికి హాజరయ్యారు. సానియా మిర్జా, ప్రజ్ఞా జైస్వాల్‌, లావణ్యలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. కాగ,  శ్రియా భూపాల్‌కు అంతకముందు నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌తో నిశ్చితార్థమైన సంగతి తెలిసిందే. ఏమైందో ఏమో కానీ ఇరువురి వివాహం ఆఖరి నిమిషాల్లో ఆగిపోయింది. అఖిల్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ కావడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై ఇరు కుటుంబాలు పెద్దగా స్పందించకపోగా.. ఈ వ్యవహారం అప్పట్లో పెద్ద హాట్‌టాఫిక్‌ కూడా మారింది. శ్రీయా భూపాల్‌ ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే రెడ్డి మనవరాలు. ప్రస్తుతం అఖిల్‌ పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టేసి, సినిమాలపై ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు.  





No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement