
న్యూఢిల్లీ: భారత ప్రముఖ మోటార్ సైక్లిస్టు, హీరో మోటో స్పోర్ట్స్ రేసర్ సీఎస్ సంతోష్ బుధవారం ప్రమాదానికి గురయ్యాడు. సౌదీ అరేబియాలో జరుగుతోన్న డాకర్ ర్యాలీ మోటార్ రేసు సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. రేసులో భాగంగా కంకరతో కూడిన ట్రాక్‌పై 135 కి.మీ వేగంతో ప్రయాణిస్తోన్న 37 ఏళ్ల సంతోష్ అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతని కుడి భుజానికి, తలకు గా యాలయ్యాయి. వెంటనే విమానంలో రియాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని, వైద్యులు అతన్ని కృత్రిమ కోమాలో ఉంచారని హీరో మోటో స్పోర్ట్స్ యాజమాన్యం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment