Hero Moto
-
మార్కెట్లోకి మళ్లీ హీరో కరిజ్మా..
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తాజాగా కరిజ్మా బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 సీసీ బైక్‌ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 1.72 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంటుంది. ప్రీమియం సెగ్మెంట్లో తమ వాటాన్ని పెంచుకునే దిశగా తమకు ఇది మరో మైలురాయి అని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. తాము ప్రస్తుతం ఈ విభాగంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని, మార్కెట్ వాటా 4–5 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పూర్తి స్థాయిలో వేగవంతంగా రూపొందించుకోనున్నట్లు గుప్తా చెప్పారు. ప్రస్తుతం 150 సీసీ లోపు సెగ్మెంట్లో అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ ఇకపై 150 సీసీ నుంచి 450 సీసీ వరకు బైక్‌ల సెగ్మెంట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది వ్యవధిలో ప్రతి మూడు నెలలకోసారి ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. -
హీరో నుంచి గ్రాండ్ లాంచ్.. తక్కువ ధరకే 110 సీసీ స్కూటర్!
గురుగ్రామ్: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ కొత్తగా జూమ్ పేరిట 110 సీసీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 68,599–76,699గా ఉంటుందని సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రణ్జీవ్జిత్ సింగ్ తెలిపారు. స్కూటర్ల మార్కెట్లో 110 సీసీ వాహనాల వాటా అత్యధికంగా 60 శాతం పైగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పోర్టీ స్కూటర్ల విభాగంలో ఉన్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీఎస్6 ప్రమాణాలకు అనుగుణమైన హీరో జూమ్‌లో పూర్తి డిజిటల్ స్పీడోమీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలర్ ఐడీ, ఎస్ఎంఎస్ అప్డేట్స్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్, మొబైల్ చార్జర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం 2022–23 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో హీరో 2,82,169 స్కూటర్లను విక్రయించింది. చదవండి: పన్ను ప్రయోజనాలు కావాలంటే.. ఈ పోస్టాఫీస్ పథకాలపై ఓ లుక్కేయండి! -
పండుగ సీజన్.. కొత్త బైక్ కొనేవారికి షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ధరలను సవరించింది. మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధర మోడల్‌ను బట్టి రూ.1,000 వరకు పెంచింది. కొత్త ధరలు వెంటనే అమలులోకి వస్తాయని కంపెనీ గురువారం ప్రకటించింది. తయారీ ఖర్చులు పెరగడంతో వాహన ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. పెరిగిన ధరలు మోటారు సైకిళ్లు, స్కూటర్లకు వరిస్తుందని పేర్కొంది. పండుగ సీజన్లో కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వడం సహజం, కానీ హీరో మోటో కార్ప్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆగస్టులో.. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 1.92% పెరిగి 462,608 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. దేశీయ విక్రయాల వాల్యూమ్ కూడా గత ఏడాది విక్రయించిన యూనిట్లతో పోలిస్తే 4.55% పెరిగి 450,740 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే ఆగస్టు 2022లో ఎగుమతులు క్షీణించాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే దిశగా హీరో మోటోకార్ప్, ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌కి ఉన్న బంకుల్లో ఈ రెండు సంస్థలు కలిసి చార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. -
మోటార్ సైక్లిస్టు సంతోష్‌కు ప్రమాదం
న్యూఢిల్లీ: భారత ప్రముఖ మోటార్ సైక్లిస్టు, హీరో మోటో స్పోర్ట్స్ రేసర్ సీఎస్ సంతోష్ బుధవారం ప్రమాదానికి గురయ్యాడు. సౌదీ అరేబియాలో జరుగుతోన్న డాకర్ ర్యాలీ మోటార్ రేసు సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. రేసులో భాగంగా కంకరతో కూడిన ట్రాక్‌పై 135 కి.మీ వేగంతో ప్రయాణిస్తోన్న 37 ఏళ్ల సంతోష్ అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతని కుడి భుజానికి, తలకు గా యాలయ్యాయి. వెంటనే విమానంలో రియాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని, వైద్యులు అతన్ని కృత్రిమ కోమాలో ఉంచారని హీరో మోటో స్పోర్ట్స్ యాజమాన్యం ప్రకటించింది. -
హీరో మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్, ధర ఎంతంటే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద దీని ధర రూ.72,950 గా ఉంది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసిన ఈ 125 సీసీ మోడల్ 8 బ్రేక్ హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ‘‘మా స్కూటర్ బ్రాండ్ మాస్ట్రో ఎడ్జ్‌కు మార్కెట్లో మంచి పేరుంది. ఈ కొత్త మోడల్ చేరికతో బ్రాండ్ ఆకర్షణ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాము’’ అని హీరో మోటోకార్ప్ సేల్స్ విభాగపు అధిపతి నవీన్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో మార్కెట్ కోలుకునేందుకు రానున్న వారాల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తామని చౌహాన్ పేర్కొన్నారు. -
జోరు తగ్గిన హీరో మోటో
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల అగ్రగామి సంస్థ హీరో మోటో కార్ప్ జూన్ త్రైమాసికం ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. నికర లాభం అర శాతం తగ్గి రూ.909 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం రూ.8,809 కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.914 కోట్లు, ఆదాయం రూ.8,622 కోట్లుగా ఉన్నాయి. రాయిటర్స్ పోల్‌లో లాభం రూ.1,001 కోట్లు, ఆదాయం రూ.9,067 కోట్ల మేర ఉంటుందన్న అంచనాలు వ్యక్తం కావడం గమనార్హం. ప్రధానంగా రెండంశాలు కంపెనీ లాభాలను ప్రభావితం చేశాయి. తయారీ పరంగా హరిద్వార్‌లోని కేంద్రానికున్న పన్ను ప్రయోజనాలు ఈ ఏడాది మార్చితో ముగిసిపోయాయి. ఇక కమోడిటీ వ్యయాలు పెరిగిపోవడంతో ఎబిటా మార్జిన్ 15.6 శాతానికి పరిమితమైంది. అయితే, ఎబిటా మరీ పడిపోకుండా కంపెనీ ధరల పెంపు, వ్యయాలకు కోత వంటి చర్యలను తీసుకుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఎబిటా 16.3 శాతంగా ఉంది. అయితే, క్రితం ఏడాది ఇదే కాలంలో జీఎస్టీ లేనందున, నాటి ఫలితాలతో పోల్చి చూడడం సరికాదని కంపెనీ పేర్కొంది. సవాళ్లున్నా ముందుకే ‘‘అంతర్జాతీయ ధోరణులతో కమోడిటీ ధరల్లో అస్థిరతల కారణంగా వాహన పరిశ్రమపై గణనీయమైన ప్రభావం పడింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఈఏడాది మిగిలిన కాలంలో పరిశ్రమ వృద్ధి కొనసా గుతుంది. వర్షాలు సాధారణంగా ఉంటాయన్న అంచనాలతో రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో విక్రయాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం’’ అని కంపెనీ చైర్మన్, ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ తెలిపారు. రానున్న నెలల్లో ప్రీమియం మోటారు సైకిళ్లు, స్కూటర్ల విడుదలతో సానుకూల దిశగా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఏథెర్ ఎనర్జీలో రూ.130 కోట్ల పెట్టుబడులు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథెర్ ఎనర్జీలో మరో రూ.130 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటాను పెంచుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 66,320 కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లు (సీసీడీ) ఏథెర్ నుంచి కొనుగోలు చేసినట్టు తెలిపింది. ‘‘సీసీడీల మార్పిడి తర్వాత ఏథెర్ ఎనర్జీలో హీరో మోటో వాటా పెరుగుతుంది. ఈ లావాదేవీ ఆగస్ట్ 31కి పూర్తవుతుందని అంచనా వేస్తున్నాం’’ అని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఏథెర్ ఎనర్జీలో హీరో మోటో కార్ప్‌నకు 32.31 శాతం వాటా ఉంది. కీలక గణాంకాలు ఇవీ... ►జూన్ త్రైమాసికంలో కంపెనీ 21,06,629 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాల సంఖ్య 18,53,647గా నమోదైంది. ► హరిద్వార్ యూనిట్‌కు పన్ను మినహాయింపులు తీరిపోవడం వల్ల లాభంపై ప్రభావం పడినట్టు కంపెనీ తెలిపింది. పన్ను వ్యయాలు రూ.379 కోట్ల నుంచి రూ.433 కోట్లకు పెరిగాయి. ► ముడి పదార్థాల వ్యయాలు రూ.5,475 కోట్ల నుంచి రూ.6,131 కోట్లకు పెరిగాయి. -
హీరో లాభం రూ.582 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటో కార్పొ 2014 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి 11.11 శాతం పెరుగుదలతో రూ.582.98 కోట్లు నికర లాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.524.66 కోట్ల లాభాలొచ్చాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ నికర అమ్మకాలు అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.6,845.91 కోట్ల నుంచి అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో రూ. 6,792.51 కోట్ల స్వల్పంగా తగ్గిందని పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 16,48,548 యూనిట్లుగా నమోదయ్యాయని సంస్థ వైస్ చైర్మన్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండీ పవన్ ముంజాల్ చెప్పారు. సంస్థ విస్తరణలో భాగంగా హీరో కంపెనీ ఇటీవలే కొలంబియాలో అడుగుపెట్టిందని గుర్తు చేశారు. మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామన్నారు.