హీరో లాభం రూ.582 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటో కార్పొ 2014 ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి 11.11 శాతం పెరుగుదలతో రూ.582.98 కోట్లు నికర లాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.524.66 కోట్ల లాభాలొచ్చాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ నికర అమ్మకాలు అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.6,845.91 కోట్ల నుంచి అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో రూ. 6,792.51 కోట్ల స్వల్పంగా తగ్గిందని పేర్కొంది.
ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 16,48,548 యూనిట్లుగా నమోదయ్యాయని సంస్థ వైస్ చైర్మన్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండీ పవన్ ముంజాల్ చెప్పారు. సంస్థ విస్తరణలో భాగంగా హీరో కంపెనీ ఇటీవలే కొలంబియాలో అడుగుపెట్టిందని గుర్తు చేశారు. మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామన్నారు.