Knowledge City
-
కేబుల్ బ్రిడ్జీపై స్టంట్లు చేస్తూ.. బాణసంచా కాల్చుతూ వెర్రి వేషాలు
హైదరాబాద్: బైక్‌పై స్టంట్లు చేస్తూ బాణ సంచా కాల్చుతూ ఐటీ కారిడార్‌లో ఓ యువకుడు హల్చల్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ప్రమాదకర రీతిలో స్టంట్టు చేయడమే కాకుండా బాణసంచా కాల్చడాన్ని సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.కేబుల్ బ్రిడ్జీపై నుంచి స్టంట్లు చేసుకుంటూ వచ్చిన యువకుడు ఐటీసీ కోహినూర్ వద్ద లెఫ్ట్‌కు తీసుకొని షాట్స్(బాణసంచా) పేల్చాడు. స్టంట్లు చేస్తూ షాట్స్ పేల్చడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాహనాల రద్దీ ఉండే ప్రాంతంలో బైక్‌పై స్టంట్లు చేయడం, బాణసంచా కాల్చడం అత్యంత ప్రమాదకరం. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేబుల్ బ్రిడ్జి పైనా స్టంట్లు చేసే వీడియోలను సేకరించినట్లు తెలుస్తోంది. బైక్‌పై నెంబర్ లేకపోవడంతో సదరు యువకుడి ఆచూకీ తెలియలేదని రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. స్టంట్లు చేసి, బాణసంచా కాల్చిన యువకుడిపై బీఎన్ఎస్ఎస్ 121 సెక్షన్ కింద ఆదివారం కేసు నమోదు చేశామన్నారు.నాలెడ్జ్ సిటీలో బైక్ రేస్.. 36 మందిపై కేసు నమోదు కేకలు వేస్తూ వాహనదారులను భయపెడుతూ బైక్ రేసింగ్‌కు పాల్పడిన 35 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్సెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. ప్రమాదకర స్థితిలో బైక్‌తో స్టంట్లు చేయడం, బిగ్గరగా అరవడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. నాలెడ్జ్సిటీలో బైక్ రేస్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానిక చేకున్నారు. నలువైపుల పోలీసులు మోహరించి బైక్ రేస్‌కు పాల్పడిన 21 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 21 బైక్‌లను స్వాదీనం చేసుకున్నారు.చదవండి: వ్యాపారి రమేష్ కుమార్ హత్య కేసులో ట్విస్ట్శుక్రవారం రాత్రి బైక్ రేస్‌కు పాల్పడిన 15 మంది, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రేస్‌కు పాల్పడిన యువకులను రిమాండ్ చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లను ఆర్టీఏ అధికారులకు అప్పగిస్తామన్నారు. బైక్ రేస్ చేయకుండా వారి తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరం ఉదని ఆయన సూచించారు. రేసింగ్‌లకు ఎలాంటి అనుమతులు లేవని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, దీపావళి నాడు కొంతమంది చేసిన ఓవరాక్షన్‌పై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం. ఎటు వెళ్తోందీ సమాజం. దీపావళి అంటే ఉల్లాసం, ఉత్సాహాలతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పర్వదినం. పండుగ నాడు ఇలాంటి వెర్రి వేషాలు వేస్తూ.. అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసం!? pic.twitter.com/pYbELJeZAR— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 3, 2024 -
స్థానిక అభివృద్ధికి గోల్డ్‌మన్ సాచ్స్ తోడ్పాటు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ అక్షరాస్యత, మహిళా ఎంట్రప్రెన్యూర్లకు చేయూత, స్థానిక విక్రేతలతో ఒప్పందాలు వంటి వాటి ద్వారా గోల్డ్‌మన్ సాచ్స్ సంస్థ స్థానిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. గోల్డ్‌మన్ సాచ్స్ వంటి దిగ్గజ సంస్థల కార్యాలయాల ఏర్పాటుతో హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు, భాగస్వామ్యాలకు అవకాశాలు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పెట్టుబడులు, బ్యాంకింగ్, సెక్యూరిటీలు, పెట్టుబడుల నిర్వహణ రంగాల్లో పేరొందిన గోల్డ్‌మన్ సాచ్స్ గురువారం ఇక్కడి నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయం ‘ఓపెల్’ను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ కంపెనీలు, స్టార్టప్‌ల వాతావరణం మరింత బలోపేతం కావడంతోపాటు స్థానిక నైపుణ్యానికి అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తమ సంస్థ రెండు దశాబ్దాల అంతర్జాతీయ ప్రస్థానంలో హైదరాబాద్, బెంగుళూరు అంతర్భాగంగా ఉన్నాయని గోల్డ్‌మన్ సాచ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ నోడ్ అన్నారు. కార్యక్రమంలో గోల్డ్‌మన్ సాచ్స్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గుంజన్ సమ్తానీ, ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యాలయంలో 2,500 మందికి వసతి ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, కన్జూమర్ బిజినెస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ తదితర రంగాలకు సంబంధించిన కార్యకలాపాల కోసం గోల్డ్‌మన్ సాచ్స్ 2021లో హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 1,500 మంది నిపుణులు ఇక్కడ పనిచేస్తుండగా తాజాగా నాలెడ్జ్ సిటీలోని సలార్పురియా సత్వ నాలెడ్జ్ పార్క్‌లో 3.51 లక్షల చదరపు అడుగులలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. దీనిలో 2,500 మంది నిపుణులు కూర్చునేందుకు అనువైన ఆధునిక వసతులు ఉన్నాయి. -
విస్తరణ బాటలో ఫనాటిక్స్
డిజిటల్ స్పోర్ట్స్ వేదిక ఫనాటిక్స్ విస్తరణ బాట పట్టింది. కొత్తగా వందమందిని రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు పెరుగుతున్న సిబ్బంది తగ్గట్టుగా కార్యాలయాన్ని నాలెడ్జ్ సిటీలో ఉన్న సత్వ భవనంలోకి మార్చింది. కొత్తగా నియమితులవుతున్న వంద మంది ఉద్యోగుల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ మేనేజర్లు, ఆన్ లైన్ ప్రొడక్షన్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లు ఉండనున్నారు. డిజిటల్ స్పోర్ట్స్ వేదికైన ఫనాటిక్స్ ఒకే ఒక ఉద్యోగితో 2018లో ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 170 మంది ఉద్యోగులు ఉన్నారను. 2022 చివరి నాటికి హైదరాబాద్‌లో వర్క్‌ఫోర్స్ సంఖ్యను 250కి పెంచుకోవాలని ఫనాటిక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: Swiggy Drone Deliveries: స్విగ్గీ మరో సంచలనం, ఒక్క ఫోన్ కొడితే చాలు! -
నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చా
నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేశా: ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల విభజన భౌగోళికంగానే జరిగిందని, మనుషులు విడిపోలేదని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతిని కలిపే శక్తి తమ పార్టీకే ఉందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి ఓటేయడం చారిత్రక అవసరమని అన్నారు. రెండ్రోజులపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల టీడీపీకి తెలంగాణ ప్రజలతో, హైదరాబాద్‌తో విడదీయరాని సంబంధం ఉందన్నారు. తెలంగాణ వెనుకబడిందనే విషయాన్ని గుర్తించి తమ పార్టీ ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. ట్యాంక్‌బండ్ సుందరీకరణ, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు, హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడం వంటి పనులతో హైదరాబాద్‌లో ఎన్టీఆర్ కొత్త శకానికి నాంది పలికారని, దాన్ని తాను కొనసాగించానని వివరించారు. అబిడ్స్ చుట్టుపక్కల ప్రాంతమే హైదరాబాద్ సిటీగా ఉన్న రోజుల్లో, పెట్టుబడుల కోసం విదే శీ ప్రతినిధులు రావడానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న నగరాన్ని నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చేసి, అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చింది, గోదావరి జలాలకు శ్రీకారం చుట్టింది తానేనన్నారు. ‘‘ఎల్ అండ్ టీతో కలసి హైటెక్‌సిటీ నిర్మించాం. మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్‌కు తీసుకురావడంతోనే ప్రపంచంలో పేరొందిన ఐటీ, నాలెడ్జ్ ఆధారిత కంపెనీలన్నీ వచ్చాయి. హైదరాబాద్‌కు వచ్చే విదేశీ కంపెనీల కోసం షాపింగ్ మాల్స్, హోటల్స్‌ను ప్రమోట్ చేశాం. స్పోర్ట్స్ కోసం స్టేడియాలను నిర్మించాం. విదేశీయులు నేరుగా హైదరాబాద్‌కు వచ్చేందుకు అప్పటి ప్రధాని వాజ్‌పేయితో మాట్లాడి అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్‌కు అనుమతి పొందాను. తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశా. బిల్‌క్లింటన్, బిల్‌గేట్స్ మొదలు అంతర్జాతీయ ప్రముఖులందరినీ హైదరాబాద్‌కు తీసుకొచ్చా. నేను చేసిన కృషి, తీసుకు వచ్చిన సంస్కరణల వల్లే 1994-95లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు తెలంగాణ మిగులు ఆదాయం గల రాష్ట్రంగా మారింది’’ అని వివరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. గెలిచే కార్పొరేటర్లు పార్టీలోనే ఉంటారు గ్రేటర్ ఎన్నికల్లో నగరాన్ని అభివృద్ధి చేసిన పార్టీలనే గెలిపించాలని చంద్రబాబు కోరారు. హైదరాబాద్ అభివృద్ధి చెందేందుకు కృషి చేశానని, అందుకే టీడీపీ-బీజేపీకి పాజిటివ్ ఓటు వేయాలన్నారు. తద్వారా ఇతరులు కూడా అభివృద్ధి కోసం పోటీపడతారని చెప్పారు. ‘‘టీడీపీని వదిలి పెట్టిన వారు పార్టీలో సామాన్య కార్యకర్తల స్థాయి నుంచి ఎలా డెవలప్ అయ్యారో చూశారు. వాళ్లు పార్టీకి ద్రోహం చేసి స్వార్థం కోసం వేరే పార్టీల్లో చేరినంత మాత్రాన మిగతా వారు ఆ బాట పట్టరు. ఒక్కరు పోయారని అందరూ వెళ్లరు. పెద్దయ్యాక పిల్లలు తమని వదిలిపోతున్నారని పిల్లలను కనకుండా పోతే సమాజం ఏమవుతుంది? ఇదీ అంతే! టీడీపీలో గెలిచి మళ్లీ పార్టీ మారతారనే భయంతో ఓటు వేయడం మానొద్దు. ఇప్పుడు టీడీపీ నుంచి గెలిచే కార్పొరేటర్లు ఈ పార్టీలోనే ఉంటారు. పార్టీ మారిన వారికి గుణపాఠం చెప్పాలి’’ అని అన్నారు. -
రంగాలవారీగా రాజధాని అభివృద్ధి
-
రంగాలవారీగా రాజధాని అభివృద్ధి
♦ రాజధానిలో పరిపాలన, ఆధ్యాత్మిక, పర్యాటక, క్రీడా తదితర నగరాల నిర్మాణం ♦ ఏ గ్రామంలో ఏ నిర్మాణం అనేదానిపై స్పష్టమైన ప్రతిపాదనలు ♦ ఐదు దశల్లో పది విభాగాల పూర్తికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన సర్కారు సాక్షి, విజయవాడ బ్యూరో: కొత్త రాజధాని అమరావతి దశ, దిశను నిర్దేశించడంలో పది ప్రాధాన్యతలను గుర్తించి దశలవారీగా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాజధాని గ్రామాలను పరిపాలన, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక, క్రీడలు, టూరిజం తదితర రంగాల్లో ప్రత్యేక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో కొన్నింటికి మాత్రమే కీలక నిర్మాణాలను పరిమితం చేశారు. మిగిలిన గ్రామాలకు సంబంధించి ఏ గ్రామంలో ఏ ప్రత్యేక విభాగం అభివృద్ధి చేయనున్నది తాజాగా గుర్తించారు. మొత్తం ఐదు దశల్లో పది విభాగాల అభివృద్ధికి సర్కారు కార్యాచరణ రూపొందించింది. వివరాలివీ.. ► రాయపూడి ప్రాంతంలో రాజ్‌భవన్, అసెంబ్లీ, సచివాలయం, శాఖల కమిషరేట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ క్వా ర్టర్స్, ప్రభుత్వ అతిథిగృహాలను నిర్మిస్తారు. ► అనంతవరాన్ని ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేస్తారు. ► కృష్ణాయపాలెంలో ప్రభుత్వ, ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులతోపాటు ప్రత్యామ్నాయ వైద్య విధానం, వైద్య సంస్థలు, అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రుల(మెడికల్ సిటీ)ను ఏర్పాటు చేస్తారు. ► ఐనవోలులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, వృత్తివిద్యా కళాశాలలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, టెక్నాలజీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లు, బిజినెస్ స్కూల్స్, బేసిక్ ఆర్ అండ్ డి సంస్థలు(విద్యా నగరం) నిర్మాణానికి ప్రతిపాదించారు. ► ఉండవల్లిలో ఐకాన్ టవర్లు, వంతెనలు, మ్యూజియంలు, రివర్ ఫ్రంట్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్(పర్యాటక నగరం)ను అభివృద్ధికి ప్రతిపాదన చేశారు. ► అబ్బిరాజుపాలెంను స్పోర్ట్స్ యూనివర్సిటీ, అథ్లెటిక్స్ స్టేడియాలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఆక్వాటెక్ స్టేడియాలు, మల్టీపర్సస్ స్టేడియాలు, ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియాలు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్‌కోర్స్ నిర్మాణాలతో క్రీడానగరంగా తీర్చిదిద్దే ప్రతిపాదన చేశారు. ► ఉద్ధండరాయునిపాలెంలో ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులతోపాటు ఇంటర్నేషనల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ సంస్థల(ఆర్థిక నగరం)ను ఏర్పాటు చేస్తారు. ► నేలపాడులో హైకోర్టు, ట్రిబ్యునళ్లు, న్యాయ యూనివర్సిటీ, న్యాయసంస్థలు, లోకాయుక్త ప్రధానమైన సంస్థల(న్యాయ నగరం)ను ఏర్పాటు చేస్తారు. ► శాఖమూరులో పరిశోధన, అభివృద్ధి, ఐటీ, ఐటీఈఎస్, ఏరోస్పేస్ రీసెర్స్, బయోటెక్, మెడికల్ రీసెర్చ్‌తోపాటు టెక్నాలజీ ఇంక్యుబేటర్స్(నాలెడ్జ్ సిటీ) ఏర్పాటు చేస్తారు. ► బేతపూడిలో సెల్యులర్ ఫోన్లు, ఆడియో, వీడియో అప్లయన్సెస్, సౌరశక్తి ఉత్పాదన సామాగ్రి, సెమీ కండక్టర్లు, సెన్సర్లు, గృహోపకరణాలు తయారు(ఎలక్ట్రానిక్స్ సిటీ) వంటివి ఏర్పాటు చేయనున్నారు.