Durgam Cheruv
-
కూల్చివేతలు ఆపండి.
-
సీఎం సోదరుడు ఇంటికి హైడ్రా నోటీసులు
-
కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
మాదాపూర్: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను పోలీసులు రక్షించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన యువతి (25) హైదరాబాద్‌కు వచి్చంది. ఆరి్థక కారణాల నేపథ్యంలో నిద్రమాత్రలు మింగిన ఆమె కేబుల్ బ్రిడ్జిపైకి చేరుకుని దుర్గం చెరువులో దూకేందుకు యతి్నస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ఆమెను కాపాడారు. అనంతరం సమీపంలోని విక్రమ్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. సదరు యువతికి మతిస్థిమితం లేదని పోలీసులు తేలిపారు. Madhapur Traffic Police's intervention saved a woman's life as they prevented her from jumping off the Durgam Cheruvu Cable bridge.A 25-year-old woman has been taken to Vikram Hospital for treatment after reportedly ingesting pills.#CyberabadTrafficPolice pic.twitter.com/e22GP5bYL7— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) June 17, 2024 -
IDC Run 2024: 28న ఇనార్బిట్ దుర్గం చెరువు రన్
మాదాపూర్: ఇనార్బిట్ దుర్గం చెరువు రన్– 2024కు సంబంధించిన రేస్ రూట్, అధికారిక టీ–షర్ట్, మోడల్‌ను గురువారం మాదాపూర్ వెస్టీన్ హోటల్లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాదాపూర్ డీసీపీ డాక్టర్ జి.వినీత్, ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు, వుమెన్ సేఫ్టీ డీసీపీ సృజన, కె రహేజా కార్ప్ సీఓఓ శ్రవణ్ గోనేలు వివరాలను వెల్లడించారు. ఇనార్బిట్ మాల్ సైబరాబాద్, , మైండ్ స్పేష్ బిజినెస్ పార్క్, ది వెస్టీన్ భాగస్వామ్యంతో ఈ నెల 28న రన్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎల్జీబిటిక్యూ కమ్యూనిటీకి చెందిన సభ్యులతో పాటు ఈ రన్లో దాదాపు 100 మంది దివ్యాంగులు పాల్గొంటారన్నారు. మొత్తం రూ.6 లక్షల విలువైన బహుమతులను వివిధ విభాగాల్లోని 48 మంది రన్నర్లకు అందిస్తామన్నారు. 21, 10, 5 కి.మీ విభాగాల్లో పోటీ ఉంటుందన్నారు. పరుగులో పాల్గొనేందుకు ఈ నెల 21 చివరి తేదీ అని తెలిపారు. ఎల్జిబిటీక్యూ, వ్యక్తులకు విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను పొందేందుకు సహాయం చేయడానికి నిధులను సేకరిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ సెంటర్ హెడ్ శరత్ బెలవాడి పాల్గొన్నారు. -
Durgam Cheruvu Musical Fountain Pics: దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం (ఫోటోలు)
-
Hyderabad: డ్రైవర్ అత్యుత్సాహం.. కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై ఓ ఆటో బోల్తా పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడంతోవ వైరల్‌గా మారాయి. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కొహినూర్ వైపు వస్తున్న ఆటో దుర్గం చెరువు తీగల వంతెనపై అకస్మాత్తుగా బోల్తా కొట్టింది. డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ ఆటో నడుపుతూ ముందుగా వెళ్తున్న బైక్‌ను తప్పించబోయి ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటుమరో ఇద్దరికి స్పల్పంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. అయితే అత్యంత వేగంతో ఆటో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఆటో పల్టీ కొట్టిన సమయంలో వెనుకనుంచి వచ్చిన కారు చాకచక్యంగా పక్కకు తిప్పడంతో ప్రమాదం తప్పింది. చదవండి: ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత -
పడవతో గస్తీ..లేక్ పోలీసింగ్ వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల 17 ఏళ్ల ఓ ఇంటర్ విద్యార్థి కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జిలపై లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలిసారిగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో దుర్గం చెరువులో పడవతో పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేశారు. కేబుల్ బ్రిడ్జి కింద వాచ్ టవర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలపై దృష్టి.. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఇంటికే పరిమితమైన పర్యాటకులు క్రమంగా బయటకు వస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే బదులు స్థానికంగా ఉన్న టూరిస్ట్ ప్లేస్‌లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దీంతో దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జిలపై సందర్శకుల తాకిడి పెరిగింది. వారాంతాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో మద్యం తాగడం, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటివి పోలీసుల దృష్టికి వచ్చాయి. దీంతో సందర్శకులకు భద్రతతో పాటూ అసాంఘిక కార్యకలాపాలకు జరగకుండా ఉండేందుకు పోలీసుల గస్తీని ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బ్రిడ్జిపై వాచ్ టవర్.. ఇప్పటికే దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో సైబరాబాద్ పోలీసులు 67 కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా బ్రిడ్జి కింద పోలీసు వాచ్‌టవర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అన్ని సీసీ కెమెరాలు అనుసంధానమై ఉంటాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఏ మూలన ఏ సంఘటన కెమెరాల్లో నిక్షిప్తమవుతుంది. అనుమానిత వ్యక్తులు సంచరించినా, ట్రాఫిక్‌జాం, ఇతరత్రా ఇబ్బందులు జరిగినా వెంటనే వాచ్ టవర్లోని పోలీసులకు తెలిసిపోతుంది. వెంటనే క్షేత్ర స్థాయిలోని పోలీసులకు సమాచారం అందించి, ఘటన స్థలానికి వెళ్లి తగిన చర్యలు చేపడతారు. వాచ్ టవర్‌లో పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారు. లేక్ పోలీసులకు ఈవీ వాహనాలు.. దుర్గం చెరువు పరిసరాలలో ఆర్టిఫీషియల్ వాటర్ ఫాల్స్, రాక్ గార్డెన్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, వాకింగ్ ట్రాక్‌ల వంటివి ఉన్నాయి. దీంతో పిల్లలు, యువకులతో ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది. కేబుల్ బ్రిడ్జి రోడ్డు మధ్యలో నిలబడి సెల్ఫీలు తీసుకోవటం, వాహనాలకు అంతరాయం కలిగిస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నియంత్రించేందుకు లేక్ పోలీసులు 24 గంటలు గస్తీ చేస్తుంటారు. ఎలక్ట్రిక్ వాహనాలతో లేక్ పోలీసులు పెట్రోలింగ్ విధులను నిర్వహిస్తుంటారు. ఆయా ప్రాంతాలలో మహిళలతో అసభ్యంకరంగా ప్రవర్తించే పోకిరీలను షీ టీమ్ పోలీసులు అక్కడిక్కడే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పలుమార్లు ఇలాంటి ప్రవర్తనే కనిపిస్తే జైలుకు పంపిస్తున్నారు. (చదవండి: నైట్ బజార్.. ఫుల్ హుషార్.) -
నిలకడగా సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యం
రాయదుర్గం/బంజారాహిల్స్(హైదరాబాద్): హీరో సాయిధరమ్‌తేజ్ స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా, అదుపుతప్పి కిందపడి గాయాలయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా ఐటీ కారిడార్ ప్రాంతంలో ఈ ప్రమా దం చోటు చేసుకుంది. రాయదుర్గం, మాదాపూర్ పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి సాయిధరమ్‌తేజ్ జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు స్పోర్ట్స్ బైక్‌పై బయలుదేరారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటి ఐటీసీ కోహినూర్ హోటల్ ముందు నుంచి ఐకియా వైపు వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో కంటి భాగం, కడుపు, ఛాతీపై గాయాలయ్యాయి. వెంటనే కొందరు వాహనదారులు 108కు సమాచారమిచ్చారు. గాయపడిన సాయి ధరమ్‌తేజ్‌ను 108 సిబ్బంది మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలిస్తూ పోలీసులకు ఫోన్ చేశారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు అతన్ని సాయిధరమ్తేజ్గా గుర్తించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయి ధరమ్‌తేజ్ హెల్మెట్ ధరించడంతో తలకు బలమైన గాయాలేవీ కాలేదని వారు వెల్లడించారు. సాయి ధరమ్‌తేజ్ నడిపిన బైక్ ఇదే.. ఇసుక మేటతోనే ప్రమాదం..... రోడ్డుపై ఇసుక మేట వేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఎప్పుడూ నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి. భారీ వాహనాల రాకపోకలతో రోడ్లపై మట్టి, ఇతర వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. ఉదయం పూట ఊడుస్తున్నా.. మరుసటిరోజు తెల్లవారేలోగా మళ్లీ మట్టి, దుమ్ము, వర్షం వస్తే ఇసుక మేట వేస్తుంది. ఇసుక మేట కారణంగానే బైక్ అదుపుతప్పినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. తేజ్ బైక్(టిఎస్ 07 జీజే 1258)ను స్వాధీనం చేసుకుని, ఐపీసీ 336, 279 సెక్షన్, 279 మోటార్ వెహికిల్ యాక్ట్ 184 కింద.. నిర్లక్ష్యం, అతివేగంగా బైక్ నడినందుకు కేసును నమోదు చేశారు. అయితే బైక్ (‘ట్రంప్’–1160 సీసీ) అనిల్‌కుమార్ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్లు తెలిసింది. సాయిధరమ్‌తేజ్, మరో నటుడి కుమారుడు, మరో ఇద్దరు ఆర్టిస్టులు వీకెండ్ పార్టీకి వెళుతున్న తరుణంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. నిలకడగా ఆరోగ్యం... సాయిధరమ్‌తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో ఐసీయూలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఛాతీ, కడుపు, కన్ను ప్రాంతాల్లో గాయాలైనట్లు గుర్తించారు. కాలర్‌బోన్ ఫ్రాక్చర్ అయినట్లు పరీక్షలో తేలింది. మిగిలిన గాయాలు ప్రమాదకరమైనవి కావని, అంతర్గతంగానూ ఎలాంటి గాయాలు లేవని వైద్యులు పేర్కొంటున్నారు. కాలర్‌బోన్ శస్త్ర చికిత్సపై మరో రోజు గడిచిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఇదిలాఉండగా శనివారం ఉదయం చిరంజీవి దంపతులు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆస్పత్రికి వచ్చి అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వీరేగాక హీరో రామ్‌చరణ్‌తేజ్, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, మంచు లక్ష్మి తదితరులు ఆస్పత్రికి వచ్చి తేజ్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అతివేగంతో నడిపారు.. అనుమతించదగిన వేగ పరిమితుల్లో తేజ్ వాహనాన్ని నడిపి, హెల్మెట్ సరిగ్గా పెట్టుకొని ఉంటే దురదృష్టకర సంఘటన జరిగేది కాదని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాల్సిన ప్రమాద ప్రాంతంలో 75 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపారని చెప్పారు. దుర్గంచెరువు వంతెనపై ఈ వేగం 100 కిలోమీటర్లుగా ఉందని తేలిందన్నారు. బైక్ నడుపుతూ ఇతర వాహనాలను నిర్లక్ష్యంగా అధిగమించినట్లు సీసీ కెమెరా ఆధారాల ద్వారా గుర్తించామని వెల్లడించారు. -
దుర్గం.. భూతల స్వర్గం!
- దుర్గం చెరువుకు సరికొత్త ముస్తాబు.. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు - సస్పెన్షన్ బ్రిడ్జి, ఫారెస్ట్ వాక్ వే, టెంపుల్ ఆఫ్ ట్రీస్, అమ్యూజ్మెంట్ పార్క్ - నేడో రేపో టెండర్లు.. సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు ఆరు నెలలు కాలుష్యం కమ్ముకుని... రూపు కోల్పోయిన దుర్గం చెరువు ఇప్పుడు సరికొత్తగా ముస్తాబవుతోంది. చుట్టూ దట్టంగా పచ్చందాలు పరుచుకుని.. విహార కేంద్రంగా ఆహ్లాదాన్ని పంచనుంది. వీకెండ్లలో నగరవాసులకు సేద తీర్చడమే కాదు.. దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించే సుందర వనంగా.. వినోద ఆరామంగా రూపుదిద్దుకుంటోంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ శాఖల సమన్వయంతో చెరువును ప్రక్షాళన చేసి.. ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టింది. సుందరీకరణలో భాగంగా చెరువు చుట్టూ పచ్చని అందాలతో పచ్చికమైదానాలు.. కూర్చునే వేదికలు.. యోగా ప్రదేశాలు, ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్‌తోపాటు దట్టమైన చెట్ల మధ్య నడకకు 590 మీటర్ల మేర ఎలివేటెడ్ వాక్‌వే వంటి ఎన్నో ప్రత్యేకతలు సుందరీకరణలో ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తిచేసేందుకు దాదాపు మూడు నుంచి నాలుగేళ్లు... సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు ఆరు నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయిన తరువాత మొత్తం అంచనా వ్యయం ఎంతనే వివరాలు తెలుస్తాయి. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలతోపాటు ప్రైవేటు సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కింద ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతున్నాయి. మొదలైన చెరువు ప్రక్షాళన పనులు దుర్గం చెరువు విస్తీర్ణం 160 ఎకరాల నుంచి దాదాపు 80 ఎకరాలకు కుంచించుకుపోయింది. బహుళ అంత స్తుల భవనాలూ వెలిశాయి. మిగిలిన ప్రదేశాన్నయినా కాపాడేందుకు ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయ కేంద్రంగా, ఐటీ హబ్‌లో విహార కేంద్రంగా మార్చేందుకు ఈ భారీ ప్రణాళికలు రూపొందించారు. తొలుత చెరువును ప్రక్షాళన చేస్తారు. జీహెచ్ఎంసీ నీటిపారుదల విభాగంలో గుర్రపు డెక్క తొలగింపు పనులు రూ.50 లక్షలతో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీంతోపాటు ఏడాది వరకు నిర్వహణను కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. 2.2 కి.మీ. మేర వాక్‌వే, సైకిల్ ట్రాక్ పనుల కోసం రూ.2 కోట్లతో టెండర్లు ఆహ్వానించను న్నారు. ఎన్సీసీ బిల్డింగ్ నుంచి దుర్గం చెరువు కట్ట వరకు వీటిని ఏర్పాటు చేస్తారు. జూన్ నెలాఖరుకు ఈ పనులు పూర్తవుతాయని సంబంధిత సూపరింటెండింగ్ ఇంజినీర్ శేఖర్‌రెడ్డి తెలిపారు. గుర్రపుడెక్క తొలగింపు రెండు నెలల్లో పూర్తవుతుందన్నారు. భాగస్వామ్య సంస్థలివీ.. టీఎస్ ఐఐసీ, టూరిజం డెవలప్మెంట్, జీహెచ్ఎంసీ,జలమండలి, వెల్స్ ఫార్గో, కె.రహేజా కార్పొరేషన్. ఎవరేం చేస్తారు..? జలమండలి 20 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి కేంద్రం జీహెచ్ఎంసీ గుర్రపుడెక్క తొలగింపు, వాక్‌వే పనులు టీఎస్ఐఐసీ యాంపీ థియేటర్, బౌల్డర్ వాక్, రాక్ గార్డెన్ ప్రస్తుత సమాచారం మేరకు దుర్గం చెరువు చుట్టూ ఇవీ ప్రత్యేకతలు.. ప్రవేశ ద్వారం సస్పెన్షన్ బ్రిడ్జి బౌల్డర్ వాక్‌వే (500 మీ.) వాటర్‌ఫ్రంట్ కేఫ్, పార్కింగ్ ఫారెస్ట్ వాక్ వే (590 మీ.) సైకిల్‌ట్రాక్, ఫౌంటైన్ , బార్బీక్యూ కియోస్క్ ఫిషీ రెస్టారెంట్, చుట్టూ తోటలు స్క్రీన్ ఆన్ ది గ్రీన్, టెంపుల్ ఆఫ్ ట్రీస్ గ్రీన్ ఫింగర్స్, అమ్యూజ్మెంట్ పార్క్ సొరంగ మార్గం... సస్పెన్షన్ బ్రిడ్జి ముగిసే ఇనార్బిట్ మాల్ దగ్గరి నుంచి ఖాజాగూడ జంక్షన్ వరకు మధ్యనున్న గుట్ట ప్రాంతంలో సొరంగ మార్గం ఏర్పాటు చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. తద్వారా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లేవారికి ఎంతో సమయం కలిసి వస్తుంది. సస్పెన్షన్ బ్రిడ్జి... అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సమీప ప్రాంతం నుంచి మాదాపూర్ ఇనార్బిట్‌మాల్ వరకు సస్పెన్షన్ బ్రిడ్జికి టెండర్లు పూర్తయ్యాయి. టెండరు దక్కించుకున్న సంస్థ సమగ్ర అధ్యయనాన్ని ప్రారంభించింది.దాదాపు కి.మీ. పొడవునా నిర్మించే ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్ నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పి దూరం తగ్గుతుంది. పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఐటీ హబ్ ముఖచిత్రంగా మార్చేందుకు... గోల్కొండ కోటకు మంచినీటి సరస్సుగా ఉపయోగపడి, రహస్య చెరువుగా పేరున్న దుర్గం చెరువు సరిసరాల్ని అన్ని వయస్సుల వారినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు వివిధ దేశాల్లోని చెరువులను అభివృద్ధి చేసిన తీరును అధికారులు పరిశీలించి వచ్చారు. వివిధ రకాల వృక్ష, జీవ జాతులతో జీవ వైవిధ్యాన్ని కూడా పెంపొందించేలా రకరకాల థీమ్స్‌తో సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నారు. రాక్ క్లైంబింగ్, రాపెల్లింగ్ వంటి సాహస క్రీడలతోపాటు పిల్లలను ఆకట్టుకునే బట్టర్ఫ్లై పార్క్ తదితరమైనవి ప్రణాళికలో ఉన్నాయి.