IDC Run 2024: 28న ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ | - | Sakshi
Sakshi News home page

IDC Run 2024: 28న ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌

Published Fri, Jan 19 2024 6:18 AM | Last Updated on Fri, Jan 19 2024 11:14 AM

- - Sakshi

మాదాపూర్‌: ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌– 2024కు సంబంధించిన రేస్‌ రూట్‌, అధికారిక టీ–షర్ట్‌, మోడల్‌ను గురువారం మాదాపూర్‌ వెస్టీన్‌ హోటల్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమానికి మాదాపూర్‌ డీసీపీ డాక్టర్‌ జి.వినీత్‌, ట్రాఫిక్‌ డీసీపీ టి.శ్రీనివాసరావు, వుమెన్‌ సేఫ్టీ డీసీపీ సృజన, కె రహేజా కార్ప్‌ సీఓఓ శ్రవణ్‌ గోనేలు వివరాలను వెల్లడించారు. ఇనార్బిట్‌ మాల్‌ సైబరాబాద్‌, , మైండ్‌ స్పేష్‌ బిజినెస్‌ పార్క్‌, ది వెస్టీన్‌ భాగస్వామ్యంతో ఈ నెల 28న రన్‌ను నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఎల్‌జీబిటిక్యూ కమ్యూనిటీకి చెందిన సభ్యులతో పాటు ఈ రన్‌లో దాదాపు 100 మంది దివ్యాంగులు పాల్గొంటారన్నారు. మొత్తం రూ.6 లక్షల విలువైన బహుమతులను వివిధ విభాగాల్లోని 48 మంది రన్నర్‌లకు అందిస్తామన్నారు. 21, 10, 5 కి.మీ విభాగాల్లో పోటీ ఉంటుందన్నారు. పరుగులో పాల్గొనేందుకు ఈ నెల 21 చివరి తేదీ అని తెలిపారు.

ఎల్‌జిబిటీక్యూ, వ్యక్తులకు విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను పొందేందుకు సహాయం చేయడానికి నిధులను సేకరిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ సెంటర్‌ హెడ్‌ శరత్‌ బెలవాడి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement