బోరబండ సైట్-3లో టాటాఏస్ ఆటో భీభత్సం సృష్టించింది.
అమీర్‌పేటః బోరబండ సైట్-3లో టాటాఏస్ ఆటో భీభత్సం సృష్టించింది. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి పొద్దుపోయాక ఓ ఆటో చిన్నపిల్లలపైకి దూసుకుపోయింది. ఎస్సై లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం స్థానికంగా ఉండే 60 ఏళ్ల వృద్దుడు శంకర్ వృత్తిరిత్యా ఆటో డ్రైవర్. అతని కుమారుడు టాటాఏస్ ఆటోను రాత్రి ఇంటి ముందు నిలిపాడు. శంకర్ తాళం తీసుకుని ఆటో స్టార్ట్ చేశాడు. కొద్దిదూరం వెళ్లాక ఆటో అదుపుతప్పి ఇళ్ల ముందు ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపైకి వెళ్లింది.
వీరిలో ఇద్దరు చిన్నారుల తలలు పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది.అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కనిపించిన చిన్నారులకు రక్తపు మరకలు కనిపించడంతో ఆగ్రహనికి గురైన తల్లిదండ్రులు శంకర్‌ను చితక బాదారు. గాయాలైన పిల్లలను చికిత్స నిమిత్తం వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపు నమోదు చేసుకున్న పోలీసులు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాహనం నడిపిన శంకర్ బ్రేకుమీద కాకుండా ఎక్స్‌లేటర్‌పై వేయడంతో అదుపు తప్పి పిల్లలపైకి వెళ్లిందని పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.