సాక్షి, నల్గొండ: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా దేవరకొండ చింతపల్లి మండలం కిష్టారం పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామ సమీపంలో పొంగిపొర్లుతున్న వాగులో ప్యాసెంజర్ ఆటో బోల్తా కొట్టింది. దీంతో అందులోని ప్రయాణికులు నీటిలో కొంత దూరం కొట్టుకు పోగా, రాములమ్మ అనే మహిళ నీట మునిగి మృతి చెందింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఆటోని పోనివ్వడంతో తమ ఇంటి దీపం ఆరిపోయిందని రాములమ్మ భర్త కన్నీటిపర్యంతమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment