కరకట్టపై పల్టీకొట్టిన ఆటో.. | Auto Overturned On The Krishna Deck 6 Injured | Sakshi
Sakshi News home page

Accident: కరకట్టపై పల్టీకొట్టిన ఆటో..

Published Tue, Jan 4 2022 8:11 AM | Last Updated on Tue, Jan 4 2022 8:11 AM

Auto Overturned On The Krishna Deck 6 Injured - sakshi - Sakshi

ప్రమాదానికి గురైన ఆటో

ఘంటసాల (అవనిగడ్డ): మండలంలోని శ్రీకాకుళం వద్ద కృష్ణా కరకట్టపై ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. పెనమలూరు మండలం గంగూరు గ్రామానికి చెందిన ఆరుగురు అవనిగడ్డలో ఓ ఫంక్షన్‌ వెళ్లి వస్తుండగా సోమవారం సాయంత్రం తిరిగి వస్తుండగా శ్రీకాకుళం కృష్ణాకరకట్ట వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పడంతో పల్టీ కొట్టి దిగువకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే 108కు ఫోన్‌ చేశారు. ఘంటసాల 108  సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ చిలకూరి వెంకటనర్సయ్య, ఫైలెట్‌ గాలం దినేష్‌ కుమార్‌ ఘటనా స్థలంలోనే తీవ్రంగా గాయపడిన అయ్యంకి ద్వారక, సురభి నిర్మలకుమారితోపాటు అయ్యంకి జానకి, మెహర్రాజ్‌ మనీషా, మరో ఇద్దరికి ప్రథమ చికిత్స చేసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు ప్రథమ చికిత్స చేసిన 108 సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. 

చదవండిOmicron Outbreak: కరోనాకు రెడ్‌ కార్పెట్‌ వేసి మరీ ఘన స్వాగతం పలుకుతోన్న గోవా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement