
బంజారాహిల్స్: వేగంగా దూసుకు వచ్చిన ఓ ఆటోవాలా ఐపీఎస్ అధికారిణి కారును ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... బుధవారం ఉదయం ఐపీఎస్ అధికారిణి షికా గోయల్ జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్తుండగా బోరబండ వైపు నుంచి వేగంగా వచ్చిన ఆటోవాలా కారును ఢీకొనడంతో కారు ధ్వంసమైంది. షికాగోయల్ డ్రైవర్ హన్మంతు ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడిని బోరబండ కమలానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ శ్రీకాంత్‌గా గుర్తించారు. తన తండ్రి ఆటోను లైసెన్స్ లేకుండానే నడిపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment