ఆటో బోల్తా కొట్టడంతో 20 మంది కూలీలు గాయడ్డారు.
ఈపుర (గుంటూరు): ఆటో బోల్తా కొట్టడంతో 20 మంది కూలీలు గాయడ్డారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఈపుర మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లా ఏల్చూరుకు చెందిన కూలీలు గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలంలో బత్తాయిలు కోసేందుకు కూలీకి వచ్చారు. వీరు ఆటోలో తిరిగి వెళుతుండగా ఈపుర మండలం కుచినపల్లి వద్ద ఆటో బోల్తాకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 20 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.