రెప్పపాటు సమయంలో ఓ పెద్ద ప్రమా దం తప్పింది. చూస్తుండగానే లారీ అదుపుతప్పి దూసుకుపోయి రెండు ఆటోలను , ఒక బైక్‌ను, ఒక టేలాను ఢీకొట్టి డ్రెరుునేజీలో ఇరుక్కుంది. ఈ సంఘటన క్షణాలపాటు భయానికి గురిచేసింది. ప్రత్యేక్ష సాక్షులు ఎండీ షరీఫ్, కిష్ట య్య కథనం ప్రకారం.. మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు అప్పుడే దుకాణాలు తీసేందుకు వ్యాపారులు వస్తున్నా రు. హోటళ్లలో టిఫిన్, టీ కోసం జనం వస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఎరువుల లోడ్‌తో వస్తున్న సీజీ04 ఈ 8929 నంబర్ గల లారీ స్పీడ్ బ్రేకర్ల వద్ద ఆగిపోవడంతో స్టీరింగ్ లాక్ అయింది.
తిరిగి స్టార్ట్ చేసి గేర్‌వేయడంతో అదుపు తప్పి లారీ వేగంగా ప్రధాన రహదారి పక్కకు దూసుకుపోయింది. దీంతో ఎదురుగా ఉన్న కుంద శ్రీనివాస్‌కు చెందిన ఏపీ01వై1846 నంబర్ గల ఆటో, షాబొద్దీన్‌కు చెందిన ఏపీ01వై6213 నంబర్ గల ఆటో, కిష్టాపూర్‌కు చెందిన మేకల చిన్నయ్యకు చెందిన ఏపీ01ఎస్2972 నంబర్ గల టీ వీఎస్ చాంప్‌కు ఢీకొట్టిం ది. అంతటితో ఆగకుండా కాసారపు మల్లవ్వకు చెందిన టేలాను ఢీకొట్టి డ్రె రుునేజీలో రెండు టైర్లు దిగబడటంతో హేర్‌కటింగ్ సెలూన్‌కు ఢీకొట్టి ఆగిపోయింది. ఈ హఠాత్పరిణామం తో పక్కనే ఉన్న హోటల్ యజమాని షరీఫ్, హేర్‌సెలూన్‌కు కటింగ్ కోసం వచ్చిన వారు, హోటల్‌కు వచ్చిన వారు పరుగులు తీశారు. అయితే కనురెప్ప పాటున లారీ దూసుకురావడం, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అర నిమిషంలోనే...
లారీ దూసుకువస్తున్న అర నిమిషంలోనే కాసారపు మల్లవ్వ టేలా దిగి పక్కు వెళ్లింది. అప్పుడే లారీ టేలను ఢీకొట్టి ధ్వంసం చేసింది. మల్లవ్వ దిగి ఉండకపోతే మరణించి ఉండేదని స్థానికులు చెప్తున్నారు. అదే విధంగా తిరుపతి అనే వ్యక్తి హేర్ సెలూన్ లోనికి పరుగులు తీయడం, హోటల్‌లో ఉన్న వారు బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఆ సమయంలో హోటల్ యజమాని షరీఫ్ పొయ్యిలో మంట వెలుగిస్తూ అక్కడే ఉన్నాడు. లారీ కేవలం ఆయనకు ఫీట్ దూరంలోనే ఆగింది. డ్రెరుునేజీ లేకుంటే కనీసం పది ప్రాణాలు గాలిలో కలిసేవని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ అక్కడి వారు తేరుకునేలోపే పరారయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
గడియలో తప్పిన గండం
Published Mon, Aug 5 2013 4:22 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement