
సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా ఆకీవీడు మండలం జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటోలో బాణాసంచా తరిలిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి ఆటోడ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలంరేగింది. ఆ వివరాలు.. ఏలూరులో నిర్వహించే జాతర కోసం భీమవరంలోని ముసలయ్య అనే బాణాసంచా తయారీదారి నుంచి భారీ ఎత్తులోబాణాసంచా సామాగ్రిని ఆటోలో తరలిస్తుండగా ఆకీవీడు జాతీయరహదారిపై ఐబీపీ పేట్రోలు సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆటో డ్రైవర్ నాగరాజు ఆటోలోనే సజీవదహనమయ్యాడు. మిగిలిన ఇద్దరు హలకొండ సత్యనారయణ, 70 శాతం కాలిపోగా కొల్లా శ్రీనివాస్ 40 శాతం కాలిన గాయాలతో ఆటోలో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. స్థానికులు 108 సాయంతో సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆటో వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా ముందు ఒక నెంబర్, వెనుక ఒక నెంబర్ ఉండటంతో సాధ్యం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment