పెనుకొండ రూరల్ : మండలంలోని గుట్టూరు-మునిమడుగు మార్గంలో బుధవారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో గుట్టూరుకు చెందిన నాగరాజు(28) మరణించినట్లు పోలీసులు తెలిపారు. నాగరాజు తమ స్వగ్రామం నుంచి అత్తగారి ఊరైన మునిమడుగుకు బుధవారం రాత్రి బైక్‌లో బయలుదేరాడన్నారు. మార్గమధ్యంలో మునిమడుగు నుంచి ఎదురొచ్చిన ఆటో ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు చొరవ చూపి వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతునికి భార్య అనిత, కుమారుడు రితిక్ ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఆటో ఢీకొని స్కూటరిస్టు దుర్మరణం
Published Thu, Mar 30 2017 11:01 PM | Last Updated on Sat, Sep 15 2018 7:51 PM
Advertisement
Advertisement