తూర్పు గోదావరి జిల్లా కాజులూరు వద్ద గురువారం ఉదయం ఆటోను ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతులలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టిప్పర్ లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.