
గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న దృశ్యం
శింగనమల: అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడిని ఆటో ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. దేవుడా ఎంత పనిచేశావయ్యా.. అంటూ తల్లి రోదించడం కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆత్మకూరు మండలం గొరిదిండ్ల ముట్టాలకు చెందిన అక్కులప్ప భార్య సాలమ్మ, కొడుకు శివ(3), కూతురు పల్లవి, బంధువులు మారెక్క, రాములమ్మలతో కలిసి శింగనమల మండలం చిన్నజలాలపురం గ్రామంలోని తన చెల్లెలు రాధమ్మ, మరిది ఆదినారాయణల గృహప్రవేశానికి సోమవారం మధ్యాహ్నం బయలుదేరారు.
బస్సులో గార్లదిన్నెకు చేరుకుని, అక్కడి నుంచి చిన్నజలాలపురానికి ఆటోలో బయలుదేరారు. వెస్ట్ నరసాపురం సమీపంలోకి రాగానే కుక్క దూరడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. సాలమ్మ, పల్లవి, శివలపై ఆటో పడింది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. సాలమ్మ, పల్లవిలకు తీవ్ర గాయాలు కాగా, రాములమ్మ, మారెక్క స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆటోలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సాలమ్మ, పల్లవిల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment