
సామ్యాతండా వద్ద లోయలో పడిన ఆటో
టేకులపల్లి : ఎదురుగా వచ్చిన పశువులను తప్పించబోయి కల్వర్టు లోయలో ఆటో పడిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని బోడు పంచాయతీ ఎర్రాయిగూడేనికి చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు సోమవారం రోళ్లపాడు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. సామ్యాతండా సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఎదురుగా కొన్ని ఎడ్లు పొడుచుకుంటూ ఆటో మీదకు దూసుకొచ్చాయి. దీంతో అదుపు తప్పిన ఆటో కల్వర్టు లోయలో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఊకే అశ్విని అనే యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం యువతి కోలుకుంది. మిగిలిన ప్రయాణికులు కోటేశ్వరరావు, సునీత, అపర్ణ, ఇద్దరు చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. లోయలో పడిన వారిని బయటకు తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment