kalvart
-
కల్వర్టును ఢీకొట్టిన బస్సు
చందంపేట (దేవరకొండ) : బ్రేకులు ఫెయిలైన బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 33 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని చిత్రియాలలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేం దుకు కాంగ్రెస్ పార్టి నాయకురాలు, సినీ నటి విజయశాంతి దేవరకొండలో నిర్వహించనున్న రోడ్‌షోలో పాల్గొననుండడంతో వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు దేవరకొండకు వివిధ వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. కాగా ఎటువంటి అనుమతులు లేకుండా కాలం చెల్లిన చిత్రియాల గ్రామానికి చెందిన వివేకానంద యూపీఎస్ పాఠశాల బస్సులో సామర్థ్యానికి మించి సుమారు 65 మందిని దేవరకొండకు తరలించారు. కాగా చిత్రి యాల గ్రామ శివారులోని మూలమలుపులు(లోయల ప్రాంతం) ఎల్లమ్మగుడి వద్ద ఒక్కసారిగా బ్రేకులు ఫేల్ కావడంతో మూలమలుపులోని కల్వర్టును ఢీకొట్టింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న స్థానిక సర్పంచ్ కాకనూరి రంగయ్య, కుంభం కాశమ్మ తీవ్ర గాయాలయ్యాయి. వీంతో పాటు మరో 31 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంత మంది బస్సులోనే ఇరుక్కుపోవడంతో జేసి సహాయంతో క్షతగాత్రులను వెలికితీశారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని కూడా హైదరాబాద్‌కు తరలించాలని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కొంత మంది విధుల్లో లేనప్పటికి ఉన్నత వైద్యాధికారుల ఆదేశాల మేరకు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడే సమాచారం అందడంతో వైద్య సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేపట్టారు. క్షతగాత్రులను దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మరికొంత మందిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రామకృష్ణ పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఉలిక్కిపడ్డ చిత్రియాల చిత్రియాల గ్రామంలో గత స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినప్పటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకనూరి రంగయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నత హోదా, ప్రముఖ వ్యాపార వేత్త అదే గ్రామం కావడంతో గ్రామస్తులంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను దేవరకొండకు చేర్చేందుకు, విజయశాంతి రోడ్‌షోను విజయవంతం చేసేందుకు కార్యకర్తలను తరలించేందుకు చర్యలు చేపట్టడంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్న ఈ నేపథ్యంలో సుమారు 60 మంది బస్సులో ప్రయాణిస్తుండగా 33 మందికి గాయాలు కావడంతో గ్రామంలో ఏం జరిగిందోనన్న ఆవేదన పెరిగిపోయింది. 33 మందికి గాయాలు కావడంతో చిత్రియాల గ్రామం ఉలిక్కిపడింది. -
లోయలో పడ్డ ఆటో..
టేకులపల్లి : ఎదురుగా వచ్చిన పశువులను తప్పించబోయి కల్వర్టు లోయలో ఆటో పడిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని బోడు పంచాయతీ ఎర్రాయిగూడేనికి చెందిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు సోమవారం రోళ్లపాడు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. సామ్యాతండా సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఎదురుగా కొన్ని ఎడ్లు పొడుచుకుంటూ ఆటో మీదకు దూసుకొచ్చాయి. దీంతో అదుపు తప్పిన ఆటో కల్వర్టు లోయలో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఊకే అశ్విని అనే యువతి స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం యువతి కోలుకుంది. మిగిలిన ప్రయాణికులు కోటేశ్వరరావు, సునీత, అపర్ణ, ఇద్దరు చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. లోయలో పడిన వారిని బయటకు తీసుకువచ్చారు. -
కల్వర్టు పైనుంచి కాలువలో పడ్డ లారీ
డ్రైవర్, క్లీనర్ సురక్షితం దిలావర్పూర్ : దిలావర్పూర్ గ్రామ బస్టాండ్ సమీపంలో శనివారం తెల్లవారుజామున నిర్మల్–భైంసా రహదారిపై ఉన్న కల్వర్టు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. మంచిర్యాల ప్రాంతం నుంచి సిమెంట్ లోడ్‌తో మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఈ లారీ దిలావర్పూర్ వద్దకు రాగానే కల్వర్డును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. అందులో ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్ ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డారు. -
కల్వర్టు నిర్మాణ పనులు ప్రారంభం
మంగంపేట (మల్దకల్) : మండలంలోని మంగంపేట స్టేజీ సమీపంలో గద్వాల–అయిజ ప్రధాన రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణం పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ర్యాలంపాడు రిజర్వాయర్ ద్వారా 108 ప్యాకేజీ కింద చేపట్టిన కాల్వ ఏర్పాటులో భాగంగా ఈ కల్వర్టు నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో కల్వర్టు నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. అదే విధంగా అమరవాయి, నీలిపల్లి, పాలవాయి, కొండపల్లి, రేపల్లి గ్రామాలకు చెందిన రైతులకు ప్రధాన కాలువ ఇదే కావడంతో నిర్మాణం పనులు పూర్తయితే కాని కాల్వ ద్వారా నీరు వెళ్లే పరిస్థితి లేదని, వెంటనే కల్వర్టు నిర్మాణం పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందే విధంగా చూడాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. -
కల్వర్ట్‌లోకి దూసుకెళ్లిన బుల్లెట్.. ఒకరి మృతి
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో ఓ బుల్లెట్ మోటార్ సైకిల్ అదుపుతప్పి కల్వర్ట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బుల్లెట్ నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మానవపాడు మండలం బొంకూరు సమీపంలో గురువారం అర్ధరాత్రి బుల్లెట్ మోటారు సైకిల్ అదుపుతప్పి కల్వర్ట్‌లోకి పడింది. మృతుడు అయిజ మండల వాసిగా తెలిసింది. నూతనంగా నిర్మించిన ఈ రాయిచూర్ రోడ్డులో ఎలాంటి సూచికలు లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోందని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కల్వర్టులో జారిపడ్డ మంత్రి హరీశ్
ఖమ్మం(వేముసూరు): తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన భారీనీటిపారుదుల శాఖా మంత్రి హరీశ్ రావు ప్రమాదవశాత్తూ కాలుజారి కల్వర్టులో పడ్డారు. ఈ సంఘటన వేముసూరు మండలం కల్లూరుగూడెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హరీశ్ రావుకు చిన్నపాటి గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న అధికారులు హరీశ్ రావుకు ప్రాథమిక చికిత్స చేయించారు.