మహబూబ్నగర్: పాలమూరు జిల్లాలో ఓ బుల్లెట్ మోటార్ సైకిల్ అదుపుతప్పి కల్వర్ట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బుల్లెట్ నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాలతో మృతి చెందాడు.
మానవపాడు మండలం బొంకూరు సమీపంలో గురువారం అర్ధరాత్రి బుల్లెట్ మోటారు సైకిల్ అదుపుతప్పి కల్వర్ట్లోకి పడింది. మృతుడు అయిజ మండల వాసిగా తెలిసింది. నూతనంగా నిర్మించిన ఈ రాయిచూర్ రోడ్డులో ఎలాంటి సూచికలు లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోందని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.