
ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న మల్లేశ్వరరావు
బడిగాం గిరిజన గ్రామ సమీప పూతికవలస రోడ్డు మలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీతంపేట మండలం చిన్నబగ్గ పంచాయతీ సంకిలికి చెందిన బిడ్డికి మల్లేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు...మల్లేసు కొత్తూరు మార్కెట్‌లో అల్లంను విక్రయించి స్వగ్రామం సంకిలికి తిరిగి మోటారుసైకిల్‌పై వెళ్తుండగా బడిగాం సమీపం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో బలంగా ఢీకొంది.
కొత్తూరు : బడిగాం గిరిజన గ్రామ సమీప పూతికవలస రోడ్డు మలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీతంపేట మండలం చిన్నబగ్గ పంచాయతీ సంకిలికి చెందిన బిడ్డికి మల్లేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు...మల్లేసు కొత్తూరు మార్కెట్‌లో అల్లంను విక్రయించి స్వగ్రామం సంకిలికి తిరిగి మోటారుసైకిల్‌పై వెళ్తుండగా బడిగాం సమీపం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో బలంగా ఢీకొంది. దీంతో రోడ్డు పక్కన ఉన్న డొంకల్లో మల్లేశ్వరరావు పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను 108 వాహనంలో స్థానిక సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారి శివాజీ ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఏఎస్‌ఐ మస్తాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.