ఆటో బోల్తాపడి ఐదుమందికి గాయాలైన సంఘటన మెదక్-చేగుంట ప్రధాన రహదారి రాజ్‌పల్లి గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది.
మెదక్: ఆటో బోల్తాపడి ఐదుమందికి గాయాలైన సంఘటన మెదక్-చేగుంట ప్రధాన రహదారి రాజ్‌పల్లి గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది. క్షతగాత్రుల కథనం ప్రకారం...మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన ఆటో మెదక్‌కు ప్రయాణీకులతో వస్తుండగా రాజ్‌పల్లి గ్రామశివారులోకి రాగానే కుక్క అడ్డం రావడంతో బోల్తాపడింది.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన కర్రొల్ల పోచయ్య, కొమ్ములక్ష్మి, గుట్టకిందిపల్లి తండాకు చెందిన లంబాడి బూలి, సోనులతోపాటు మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స చేస్తున్నారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.