మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం కానాపురంలో మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పరిమితికి మించి ప్రయాణుకులను ఆటోలో ఎక్కించుకుని ... అతివేగంతో ఆటో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యేక సాక్షులు వెల్లడించారు. ఆటో డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.