రోదిస్తున్న కుటుంబ సభ్యులు బోయ లక్ష్మిదేవి(ఫైల్) బోయ ఉసేనమ్మ (ఫైల్)
గూడూరు రూరల్: మోకాళ్ల నొప్పులు, కంటి చూపు లోపించడంతో మహానందిలో నాటు వైద్యం చేయించుకునేందుకు ఆటో వెళ్తూ అత్తా బోయ ఉసేనమ్మ(70), కోడలు బోయ లక్ష్మిదేవి(45), మృతి చెందారు. మండల పరిధిలోని చనుగొండ్ల గ్రామానికి చెందిన ఉసేనమ్మకు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కుమారులు. కాగా అందరికి పెళ్లిళ్లు చేసి కుమారుల వద్ద జీవనం సాగిస్తోంది. లక్ష్మిదేవికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడైన అన్నమయ్యకు వివాహం కాలేదు. లక్ష్మిదేవి భర్త వెంకటేష్‌తో కలిసి స్థానిక బస్టాండ్ సమీపంలో టీ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తోంది.
కొంత కాలంగా మోకాళ్ల నొప్పులతో లక్ష్మిదేవి, కంటి చూపు సమస్యతో ఉసేనమ్మ బాధపడుతున్నారు. నాటు మందు ద్వారా వ్యాధులను బాగు చేసుకునేందు కు గానూ మూడు వారాలుగా మహానందికి వెళ్తున్నారు. ఆదివారం నాటు మందు వేయించుకునేందుకు ఉసేనమ్మ, లక్ష్మిదేవితో పాటు పెద్ద కొడుకు అశోక్, బంధువులు సరోజ, మద్దిలేటి, వై.ఖానాపు రం భగవంతులు ఆటోలో బయలుదేరి సోమయాజుల పల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చను గొండ్లకు చెందిన అత్తా, కోడలు మృతి చెందగా అదే గ్రామానికి చెందిన భార్య, భర్తలు సరోజ, మద్దిలేటి, మృతురాలు లక్ష్మిదేవి కుమారుడు అశోక్, భగవంతులు గాయాలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment