వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమరవెల్లి వద్ద స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటో బుధవారం బోల్తా పడింది.
వరంగల్: వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమరవెల్లి వద్ద స్కూల్ విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటో బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అధిక వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షలు వెల్లడిస్తున్నారు. ఆటో డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.