అశ్వారావుపేట (ఖమ్మం): ఖమ్మం జిల్లా అశ్వారావుపేట సమీపంలో బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలోజరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోల్లో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.