ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని మంచిర్యాల-చెన్నూరు జాతీయ రహదారిపై నర్వ బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టింది.
ఆదిలాబాద్(జైపుర్): ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని మంచిర్యాల-చెన్నూరు జాతీయ రహదారిపై నర్వ బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకా గౌడ్(60) అనే వృద్ధుడు అక్కడిక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.