ఆటో బోల్తా: ఏడుగురికి గాయాలు | 7 injured in auto accident in nalgonda distirict | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: ఏడుగురికి గాయాలు

Published Fri, Jan 30 2015 10:59 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

7 injured in auto accident in nalgonda distirict

తుర్కపల్లి: నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓ ఆటో బోల్తాపడింది. శుక్రవారం ఉదయం మండల కేంద్రంలోని హైదరాబాద్ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 మంది గాయపడ్డారు. అదే రహదారి పై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

గాయపడిన వారిలో  6 మంది మండలంలోని దత్తాయిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కుషాయిగూడ నుంచి దత్తాయిపల్లికి  వెళుతూ ఈ ప్రమాదానికి గురయ్యారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement