ఆటో నుంచి కిందపడి ముగ్గురికి గాయాలు | Three injured in auto accident in prakasam district | Sakshi

ఆటో నుంచి కిందపడి ముగ్గురికి గాయాలు

Published Tue, Feb 23 2016 4:06 PM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

Three injured in auto accident in prakasam district

ఒంగోలు :  ఆటో నుంచి కిందపడి ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలైన సంఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కొండేపి మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..... కొండేపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన గోవిందమ్మ (65), కవిత (35), స్మైలీ (8) మంగళవారం కొండేపి నుంచి వారి గ్రామానికి ఆటోలో వెళ్తున్నారు. వారు ఆటో వెనుక భాగంలో కూర్చున్నారు. అయితే వారు ప్రయాణిస్తున్న ఆటోకు అకస్మాత్తుగా గేదెల మంద అడ్డం వచ్చింది.

దీంతో ఆటో డ్రైవర్ ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. ఆటో అదుపు తప్పి వెనుక కూర్చున్న ఐదుగురు వ్యక్తులు కిందపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి.  స్థానికులు వెంటనే స్పందించి... వారిని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement