రెండు ఆటోలు ఢీ: ఇద్దరి దుర్మరణం
Published Wed, Nov 16 2016 10:53 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
భూత్పూర్ : మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమొల్గర గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. ప్రయాణికులను తీసుకెళుతున్న రెండు ఆటోలు ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement