స్కూల్‌ ఆటో బోల్తా: విద్యార్థులకు గాయాలు | students injured in auto accident at nirmal | Sakshi
Sakshi News home page

స్కూల్‌ ఆటో బోల్తా: విద్యార్థులకు గాయాలు

Published Thu, Mar 30 2017 4:17 PM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM

students injured in auto accident at nirmal

నిర్మల్‌: స్కూల్‌ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నిర్మల్‌ మండలం కొండాపూర్‌ వద్ద గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు జిల్లా కేంద్రంలోని విజయ హైస్కూల్‌ నుంచి స్కూల్‌ ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది.
 
ఈ ప్రమాదంలోరాకేష్‌, బ్లెస్సీతో పాటు మరో చిన్నారికి తీవ్ర గాయాలుకాగా మిగతా ఐదుగురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు గాయాలపాలైన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆటోకు సైకిల్‌ అడ్డురావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చేబుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement