వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు దాటుతున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
బెస్తవారిపేట: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు దాటుతున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా బెస్తవారపల్లి మండలం ఓంకారపురం గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో.. ఆటోలో ఉన్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.