చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురం వద్ద ఆదివారం ఆటో చెట్టును ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 9 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
క్షతగాత్రలను మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో పోలీసులు వారిని తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక వేగంతో ఆటోను నడపడం వల్లే ఆ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.