New Currency
-
‘625 టన్నుల కొత్త నోట్ల రవాణా’
ముంబై: 2016లో నోట్ల రద్దు తర్వాత వాయుసేనకు చెందిన విమానాల్లో 625 టన్నుల బరువు గల కొత్త కరెన్సీ నోట్లను రవాణా చేసినట్లు వాయుసేన మాజీ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా పేర్కొన్నారు. శనివారం ఐఐటీ–బాంబేలో జరిగిన ఓ టెక్ ఫెస్ట్‌లో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతర్గత సేవల్లో భాగంగా 625 టన్నుల కొత్త కరెన్సీ నోట్లను రవాణా చేయడానికి 33 మిషన్లు నిర్వహించామన్నారు. 2016, నవంబర్ 8న పాత 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘నోట్ల రద్దు సమయంలో కొత్త కరెన్సీ నోట్లను వాయుసేన రవాణా చేసింది. కోటి రూపాయలకు 20 కేజీల బ్యాగ్ ఉపయోగించామ’ని బీఎస్ ధనోవా అన్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం గురించి మాట్లాడుతూ ఇలాంటి వివాదాలు ఆయుధాల సేకరణపై ప్రభావం చూపుతాయన్నారు. -
కొత్త రంగుల్లో రూ.20 నోటు
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొత్తగా ఆకుపచ్చ రంగులో రూ. 20 కరెన్సీ నోటును చలామణిలోకి తీసుకురానుంది. ఈ కొత్త రూ.20 నోట్‌పై రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. ఈ నోటుపై కొత్త డిజైన్లు, అందులో కలిసేలా రేఖాగణిత నమూనాలు ఉంటాయి. గతంలోలాగే గాంధీజీ సిరీస్‌లోనే ఈ కొత్త నోట్ కూడా ఉంటుంది. కొత్త 20 రూపాయల నోటు వెనుకవైపు మన చారిత్రక వారసత్వ సంపదైన ఎల్లోరా గుహల చిహ్నం ఉంటుంది. నోటుకు, వెనుకవైపు స్వచ్ఛభారత్ లోగో, నినాదం ఉంటాయి. ఎల్లోరా గుహల చిత్రం, దేవనాగరి లిపిలో 20 అంకె ఉంటుంది. కొత్త నోట్‌తోపాటు పాత నోట్లూ చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. -
త్వరలోనే రూ.20 నోటు, మరి పాతది?
సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కొత్త నోటును చలామణిలోకి తీసుకురానుంది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో కొత్త 20 రూపాయల నోటును త్వరలోనే చలామణిలోకి తేనుంది. అదనపు భద్రతా ప్రమాణాలతో రూ. 20నోటును చలామణిలోకి తీసుకురానున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్ కింద కొత్త నోట్లను తీసుకొచ్చినప్పటికీ, రద్దు చేసిన రూ.1000, రూ. 500 నోట్లు మినహా మిగిలిన పాత నోట్లన్నీ చలామణీలోనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ డేటా ప్రకారం.. 2016, మార్చి 31 నాటికి 492 కోట్ల రూ. 20నోట్లు చలామణీలో ఉన్నాయి. 2018 మార్చి నాటికి ఈ సంఖ్య 1000కోట్లకు చేరినట్లు ఆర్బీఐ అంచనా. దేశంలో మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో 9.8శాతం రూ. 20 కరెన్సీ నోట్లు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. కాగా 2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు (రూ. 1000, రూ. 500) తర్వాత ఆర్బీఐ అనేక కొత్త నోట్లను విడుదల చేసింది. రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50, రూ. 10 విలువ గల కొత్త కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తీసుకొచ్చిన మిగతా కొత్త నోట్ల మాదిరిగానే రూ.20 నోటుకూ పాత నోట్ల కంటే కాస్త చిన్న సైజులో, డిజైన్ కూడా పాతవాటి కంటే భిన్నగా ఉండనుందని సమాచారం. -
కొత్త రూ.50 నోట్లు, భలే ఉన్నాయి..
ముంబై : దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా మరో కొత్త బ్యాంకు నోట్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. త్వరలోనే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త రూ.50 నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నట్టు రిజర్వు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. మహాత్మాగాంధీ(కొత్త) సిరీస్‌లో వీటిని ఆర్బీఐ విడుదల చేయబోతున్నట్టు పేర్కొంది. ఈ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుందని కూడా తెలిపింది. ఈ బ్యాంకు నోట్లపై ఒకవైపు గాంధీ బొమ్మ, మరోవైపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథోత్సవం బొమ్మ ఉంటుందని తెలిసింది. ఈ నోట్ల బేస్ కలర్ ఫ్లోర్‌సెంట్ బ్లూ. ఈ బ్యాంకు నోటు పరిణామం 66 mm x 135 mm. కొత్తగా రూ.20, రూ.50 నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్టు రిజర్వు బ్యాంకు గతేడాది డిసెంబర్లోనే తెలిపింది. కాగ త్వరలో విడుదల కాబోతున్న కొత్త రూ.50 నోట్లతో పాటు, ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న పాత రూ.50 కరెన్సీ నోట్లు కూడా చట్టబద్ధంగానే కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యాంకు నోట్ల ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో ఏర్పడిన చిల్లర నోట్ల సమస్యతో ఆర్బీఐ తక్కువ విలువ కలిగిన నోట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. త్వరలోనే రూ.200 నోట్లు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి. -
త్వరలో 20 రూపాయిల నోట్లు: ఆర్బీఐ
ముంబై : పెద్ద నోట్ల రద్దు అనంతరం మార్కెట్లో నెలకొన్న చిన్న నోట్ల కొరతకు ఆర్బీఐ క్రమక్రమంగా చెక్ పెడుతోంది. తాజాగా త్వరలో మహాత్మాగాంధీ సిరీస్ 2005లో కొత్త రూ.20 బ్యాంకు నోట్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ కొత్త నోట్లు నెంబర్ ప్యానల్లో 'ఎస్' అనే ఇన్సెట్ లెటర్‌ను కలిగి ఉండి, ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో మార్కెట్లోకి విడుదల చేస్తామని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రెండు నెంబర్ ప్యానల్స్‌లోనూ ఇన్సెట్ లెటర్ 'ఎస్' ఉంటుందని ఆర్బీఐ చెప్పింది. ఈ నోట్లు ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.20 నోట్ల మాదిరి డిజైన్‌నే కలిగి ఉండనున్నాయని కూడా ఈ ప్రకటనలో పేర్కొంది. అంతకముందు ఆర్బీఐ జారీచేసిన 20 రూపాయిల నోట్లను కూడా చట్టబద్ధమైనవిగానే కొనసాగిస్తామని తెలిపింది. -
రూ.200 నోట్లపై షాకింగ్ నిర్ణయం?
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్లో నెలకొన్న చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా త్వరలోనే రూ.200 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే వీటి ప్రింటింగ్ ఆర్డర్ కూడా షురూ అయింది. 2017 ఏడాది ముగియడానికి ముందే ఈ కొత్త నోట్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. దీని వల్ల లోయర్-డినామినేషన్ కరెన్సీకి సంబంధించిన డిమాండ్, సప్లై మధ్య అంతరం తగ్గుతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్తగా తీసుకురాబోతున్న రూ.200 కరెన్సీ నోటుపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా షాకింగ్ నిర్ణయం కూడా తీసుకోబోతుందని తెలుస్తోంది. ఈ నోట్లను ఏటీఎంల ద్వారా అందించకూడదని యోచిస్తున్నట్టు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీటిని కేవలం బ్యాంకు బ్రాంచుల వద్దనే సర్క్యూలేట్ చేయాలని ఆర్బీఐ చూస్తుందట. అచ్చం రూ.10, రూ.20, రూ.50 కరెన్సీ నోట్ల మాదిరిగా ఈ కొత్త రూ.200 నోట్లు కూడా కేవలం బ్యాంకు బ్రాంచులోనే లభ్యం కానున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతేడాది నవంబర్‌లో పాత రూ.500, రూ.1000 నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ రద్దుతో మార్కెట్లోకి ఎక్కువగా కొత్త రూ.2000, రూ.500 సప్లయ్ చేయడంతో చిన్న నోట్ల సమస్య ఏర్పడింది. నోట్లు ఉన్నప్పటికీ వాటిని ఖర్చు చేయాలేని పరిస్థితి ప్రజల్లో నెలకొంది. దీంతో రూ.200 నోట్లను కొత్తగా తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే రద్దుచేసిన రూ.1000 నోటును ఇప్పట్లో తీసుకొచ్చే ఉద్దేశ్యాలు లేనట్టు ఆర్బీఐ వర్గాలు చెప్పాయి. -
ఆర్బీఐకొత్త నాణేలు త్వరలో.. మరి పాతవి
ముంబై: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా త్వరలో కొత్త నాణేలను పంపిణీ చేయనున్నది. త్వరలోనే రూ. 5,10 కాయిన్లను చలామణి లోకి తీసుకు రానుంది. భారత జాతీయ పురావస్తుశాఖ ఏర్పడి 125 సం.రాలు అయిన సందర్భంగా కొత్తగా రూ.10 విలువైన నాణేలను చలామణిలోకి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. అలహాబాద్ హైకోర్టు 150 వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త రూ.5 నాణేలను ప్రవేశపెట్టనున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా కొత్త రూ.10 నాణేనికి వెనుక వైపు నేషనల్ అర్చీవ్స్ బిల్డింగ్ చిత్రం, దానికింద 125 ఇయర్స్ అన్న అక్షరాలు వస్తాయని కేంద్ర బ్యాంక్ తెలిపింది. అలాగే 125 వ వార్షికోత్సవ వేడుక చిహ్నాన్ని కూడా జోడిస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అలాగే కొత్త రూ.5 నాణేలపై అలహాబాద్ హైకోర్టు భవనం ఫోటోతోపాటు 1866-2016 ఆంగ్ల సంఖ్యలు ఈ బొమ్మ కింద వచ్చేలా రూపొందించనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా రూ. 5, 10 పాత నాణేలు కూడా చట్టపరంగా చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. -
ఆ రోజు ఆర్బీఐ దగ్గరున్న కొత్త నోట్లెన్నో తెలుసా?
ముంబాయి : పాత నోట్ల రద్దు నిర్ణయం ముందస్తు అన్ని ప్రణాళికలు తీసుకున్నాకే ప్రకటించామని ప్రభుత్వం ఊదరగొడుతుంటే, సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లో వాటిలో ఉన్న నిజమెంతో తేలింది. బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తూ పాత నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ప్రధాని ప్రకటించిన రోజున ఆర్బీఐ వద్ద కేవలం రూ.4.95 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే ఉన్నాయని ఆర్టీఐ సమాధానంలో వెల్లడైంది. ముంబాయికి చెందిన ఆర్టీఐ కార్యకర్త అనిల్ గల్గలి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ వివరాలు వెల్లడించింది. నవంబర్ 8వ తేదీన తమ వద్దనున్న పాత నోట్లకు నాలుగవ వంతు కంటే తక్కువగా కొత్త నోట్లున్నాయని ఉన్నాయని పేర్కొంది. అంటే రూ.4.94 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పింది. అదేవిధంగా రద్దుచేసిన రూ.500, రూ.1000 నోట్లు రూ.20.51 లక్షల కోట్లున్నట్టు తెలిపింది. కొత్త నోట్లు సరిపడ లేకపోయినప్పటికీ, సమస్యలు తలెత్తుతాయని తెలిసినప్పటికీ 125 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న నగదును నిరూపయోగంగా మార్చుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని గల్గలి విమర్శించారు. ఆశ్చర్యకరంగా ఆ రోజున ఆర్బీఐ వద్ద ఒక కొత్త రూ.500 నోటు కూడా లేదని, నగదు కొరతతో ఏర్పడుతున్న సమస్యలకు తర్వాత రూ.500 నోట్లను ప్రింట్ చేయడం ప్రారంభించి సిస్టమ్‌లో తీసుకొచ్చారని ఆర్టిఐ సమాధానంలో తేలిందని గల్గలి వెల్లడించారు. నవంబర్ 8వ తేదీన రూ.15.44 లక్షల కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లు చలామణిలో ఉన్నాయని అంచనావేశారు. అయితే ఇన్ని వివరాలు తెలిపిన ఆర్బీఐ నవంబర్ 9 నుంచి 19 దాకా బ్యాంకులకు సరఫరా చేసిన నోట్ల వివరాలను మాత్రం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్8(1)ని పేర్కొంటూ గోప్యంగా ఉంచింది. -
నోటుపై ఆర్బీఐ చెప్పిన కొత్త కబురు
త్వరలోనే కొత్త 50 రూపాయల నోటు విడుదల న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) త్వరలోనే కొత్తగా 50 రూపాయల నోటును విడుదల చేయనుంది. సరికొత్తగా తీసుకురానున్న ఈ 50 రూపాయల నోటుపై నంబర్ ప్యానెల్లో రెండువైపులా 'ఎల్' అనే ఆంగ్ల అక్షరం ఉంటుందని, దీనిపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కూడా ఉంటుందని ఆర్బీఐ సోమవారం తెలిపింది. అలాగే నంబర్ ప్యానెల్లో అంతర్గతం 'ఆర్' అనే అక్షరం కూడా ఉంటుందని చెప్పింది. అయితే, కొత్తగా 50 రూపాయల నోటు తీసుకువస్తున్నప్పటికీ, ఇప్పటివరకు చలామణిలో ఉన్న పాత రూ. 50 నోట్లను రద్దు చేయబోమని స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ 2005 సిరీస్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ కొత్త 50 రూపాయల నోటుపై 2016 సంవత్సరం ముద్రించి ఉంటుందని తెలిపింది. పెద్దనోట్ల రద్దుతో దేశమంతటా నగదుకు తీవ్ర కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగదు సరఫరాను పెంచేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చిల్లర కొరత నేపథ్యంలో రూ. 500 నోటు ముద్రణపై ఇప్పుడు అధిక దృష్టి కేంద్రీకరిస్తామని, ఇక నుంచి 500నోట్లు అధికంగా విడుదల చేస్తామని ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మరో కొత్త నోటు వస్తోంది
న్యూఢిల్లీ : పాత నోట్లు రూ.500, రూ.1000 రద్దుతో ఏర్పడిన నగదు కొరతతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక ప్రకటన చేసింది. మహాత్మాగాంధీ సిరీస్-2005లో కొత్త రూ.100 బ్యాంకునోట్లను జారీచేయనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఈ కొత్త నోట్లలో నంబర్ ప్యానెల్స్ ఇన్సెట్ లెటర్లు ఏమీ ఉండవని తెలిపింది. అయితే పాత రూ.100 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీలాగానే కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది. పాత నోట్ల రద్దు అనంతరం రూ. 500, రూ.2000 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదలచేసింది. కానీ అవి తక్కువ మొత్తంలో విడుదల కావడంతో నగదు కొరత ఏర్పడింది. మరోవైపు పెద్ద నోట్లకు చిల్లర సమస్య ఏర్పడింది. రూ.2000కు సరిపడ చిల్లర దొరకకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న నోట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవలే కొత్త రూ.20, రూ.50 నోట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ, ప్రస్తుతం రూ.100 నోట్లనూ కొత్తవి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ కొత్త రూ.100 నోట్లతో ప్రజలకు ఉపశమనం కల్గించాలని ఆర్బీఐ నిర్ణయించింది. -
పోస్ట్ ఆఫీసుల్లో కొత్త నోట్లు సిద్ధం
న్యూఢిల్లీ: డిమానిటైజేషన్ క్రమంలో ఆర్థిక శాఖ తీసుకుంటున్న ఉపశమన చర్యలను కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ వివరించారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన దాదాపు లక్షా 55 వేల పోస్ట్ ఆఫీసుల్లో నగదు అందుబాటులో ఉందని తెలిపారు. కొత్త కరెన్సీ నోట్లు రూ500, రూ.1000 నోట్లు అందుబాటులో ఉంచినట్టు ప్రకటించారు. జిల్లా కేంద్రాలల్లో సహకార బ్యాంకుల్లో నగదునిల్వపై ఆర్ బీఐకి ఆదేశిలిచ్చామని తెలిపారు. జిల్లా సహకార బ్యాంకుల్లో నాబార్దు 21 వేల కోట్లు సహకార బ్యాంకులకు పంపామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్బీఐ పరిస్థితిని సమీక్షిస్తోందని తెలిపారు. ముఖ్యంగా రబీసీజన్ లో రైతులకు ఇబ్బందు ల్లేకుండా ఈ చర్యలు తీసుకున్నామని ఆయన ప్రకటించారు. నాబార్డ్ తదితర బ్యాంకులతో ఆర్థిక శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిందని వివరించారు. రుపే చార్జీల రద్దుతో బాటు డెబిట్ కార్డులపై అన్ని చార్జీలను కూడా డిశెంబర్ 31 వరకు పూర్తిగా రద్దుచేసినట్టు గుర్తుచేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ డిజిటల్ బ్యాంకింగ్ ను ఉపయోగించుకోవాలని, ఇంటర్నెట్ పేమెంట్ల ద్వారా చెల్లింపులు చేయాలని కోరినట్టు తెలిపారు. ఈ వ్యాలెట్ల నగదు పరిమితిని పెంచినట్టు ప్రకటించిన శక్తికాంత దాస్ ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈ పే మెంట్లపై వివరించారు. అలాగే పరిస్థితిని డీల్ చేయడంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు బాగా పనిచేశాయని శక్తికాంత దాస్ ప్రశంసించారు. ప్రయివేట్ బ్యాంకులు కూడా తగిన సేవలు అందించాయని కొనియాడారు. -
రూ.2000 నోట్లపై సరికొత్త వివాదం
కోల్‌కతా: రిజర్వ్ బ్యాంక్ కొత్తగా విడుదల చేసిన రూ.2000 నోటుపై ఇప్పటికే వెలుగుచూసిన వాటికి తోడు సరికొత్త వివాదం చెలరేగింది. కొత్త నోటుపై జాతీయ మృగం బెంగాల్ టైగర్ బొమ్మకు చోటు కల్పించకపోవడాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపడుతున్నారు. ఆర్బీఐ ముద్రించే అన్ని రకాల కరెన్సీ నోట్లపై బెంగాల్ టైగర్ బొమ్మ ఉంటుందని, అయితే కొత్తగా తీసుకొచ్చిన రూ.2000 నోటుపై మాత్రం దానికి చోటు కల్పించలేదన్న ఆమె.. మోదీ సర్కారు దురుద్దేశపూరితంగానే ఈ పనిచేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘రాయల్ బెంగాల్ టైగర్ గురించి, సుందర్బన్ సౌందర్యం గురించి ప్రపంచమంతటికీ తెలుసు. బెంగాల్ పులి మన జాతీయ జంతువు. అందుకే ఆర్బీఐ ముద్రించే అన్ని నోట్లపై ఆ బొమ్మ ఉంటుంది. కొత్త రూ.2000 నోటుపై మాత్రం ఏనుగు, నెమలి, కమలం బొమ్మలున్నాయి. ఏనుగు మన జాతీయ సంపద, కమలం జాతీయ పుష్పం, నెమలి జాతీయ పక్షి కాబట్టి వాటికి చోటుకల్పించడం సబబే కానీ జాతీయ జంతువు పులి బొమ్మను ఎందుకు తొలగించినట్లు? ఈ ప్రశ్నకు మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే’అని మమత బెనర్జీ అన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయంతో పేద, మధ్యతరగతి వర్గాల జీవితాలు అతలాకుతలం అయ్యాయన్న మమత.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తొలిసారి కొత్త నోట్లపై మాట్లాడిన ఆమె సరికొత్త వివాదానికి తెరలేపారు. కొత్త 2000 నోటులో ఒకవైపు జాతిపిత మహాత్మా గాంధీ, రెండోవైపు మంగళ్యాన్ బొమ్మలు ప్రధానంగా కనిపిస్తాయి. వీటితోపాటు స్వచ్ఛభారత్ లోగో, ఏనుగు, నెమలి, కమలం పువ్వు బొమ్మలను కూడా కనిపిస్తాయి. ఈ వరుసలో జాతీయ జంతువుకు చోటుదక్కలేదు. కానీ రిజర్వ్ బ్యాంక్ లోగోపై కనిపించే పులి బొమ్మ ఉంటుంది. జంతువుల జాబితాలో పులిని చేర్చకపోవడంపై ఆర్బీఐ, ప్రభుత్వ వర్గాల నుంచి సమాధానం వెలవడాల్సిఉంది. -
అప్పుడే కొత్త నోట్లతో అవినీతి స్టార్ట్!
అహ్మదాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా సంక్షోభంలో కూరుకోగా.. ఓ ఇద్దరు మాత్రం ప్రభుత్వం జారీచేస్తున్న కొత్త నోట్లతో అవినీతికి తెరతీశారు. రూ.2.5 లక్షల లంచం తీసుకున్న ఓ ఇద్దరు గుజరాత్ పోర్ట్ ట్రస్ట్ అధికారులు అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. మరో రూ.40వేలను ఓ అధికారి ఇంటినుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే లంచం తీసుకున్న మొత్తమంతా నవంబర్ 11 నుంచి బ్యాంకుల్లో కొత్తగా జారీచేస్తున్న రూ.2000 నోట్లదే కావడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. బ్లాక్‌మనీని నిరోధించడానికి ప్రభుత్వం పాత పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయగా.. లంచగొండులు కొత్త నోట్లతో అవినీతికి పాల్పడుతున్నారు. కండ్లా పోర్ట్ ట్రస్ట్ ఆఫీసులో పనిచేసే సూపరింటెండింగ్ ఇంజనీర్ పీ శ్రీనివాసు, సబ్ డివిజనల్ ఆఫీసర్ కే కాంటేకర్లు, ఓ ప్రైవేట్ ఎలక్ట్రిక్ సంస్థ పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి రూ.4.4 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారని గుజరాత్ అవినీతి నిరోధక బ్యూరో అధికారులు చెప్పారు. నవంబర్ 15న ఈ ఇద్దరు అధికారులకు మధ్యవర్తితగా వ్యవహరించిన రుద్రేషర్ అనే వ్యక్తి సంస్థ నుంచి రూ.2.5 లక్షలు వసూలు చేయడానికి అంగీకరించినట్టు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి కేపీటీ అధికారులు కోరిన లంచం వివరాలను ఆ సంస్థ యజమానులు ఏసీబీ అధికారుల వద్ద ఫిర్యాదుచేశారు. అవినీతిని ట్రాప్ చేసిన ఏసీబీ, మధ్యవర్తితిగా వ్యవహరించిన రుద్రేషర్ను, ఆ ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుంది. శ్రీనివాస్ అనే ఇంట్లో మరో రూ.40వేల కొత్త కరెన్సీ నోట్లను కూడా అధికారులు స్వాధీనంచేసుకున్నారు. ఇంతమొత్తంలో కొత్త నోట్లు వారి దగ్గరకు ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. కాగ, పాత నోట్ల రద్దుతో కనీస అవసరాలకు డబ్బులు కూడా లేక ప్రజలు కొత్త నోట్ల కోసం బ్యాంకుల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, అధికారులు మాత్రం కొత్త నోట్లతో అవినీతి తెరతీశారు. -
రూ.500 నోట్లు వచ్చేశాయ్
న్యూఢిల్లీ: కొత్త రూ.500 నోట్లను సోమవారం ఢిల్లీ ప్రజలకు అందాయి. ఢిల్లీ ఏటీఎంలలో ఐదు వందల రూపాయల నోట్లు లభ్యమవుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రూ.100 నోట్లను ఏటీఎంలలో పెద్ద మొత్తంలో ఉంచడం వల్ల అవి త్వరగా అయిపోయాయి. తాజాగా రూ.500 నోట్లతో ఒక్కో ఏటీఎం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలకు అవి అందుబాటులో ఉంటున్నాయి. కాగా, సోమ,మంగళవారాల్లో దేశమంతటా రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. -
అంబేడ్కర్ ముఖచిత్రంతో కొత్త రూ.10 నాణేలు!
ముంబై: అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా త్వరలో కొత్త రూ.10 నాణేలను విడుదల చేస్తామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఈ కొత్త నాణేలపై ఒకవైపు అంబేడ్కర్ ముఖచిత్రం, ఆంగ్లంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి అనే వాక్యం, 2015 అంకె ఉంటాయని పేర్కొంది. -
ఆర్బీఐ కొత్త రూ.5 నాణెం!
ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అతి త్వరలో కొత్త రూ.5 నాణేలను మార్కెట్లోకి తీసుకురానుంది. 1965లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం 50వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నాణేలను ముద్రిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నాణెంలో ఒకవైపు అశోక స్తంభపు లయన్ క్యాపిటల్ మధ్యలో ఉండి, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. మరొకవైపు ‘అమర్ జవాన్’ స్మారక చిహ్నం మధ్యలో ఉండి దానికి ఇరువైపుల ఆలివ్ కొమ్మ ఆకులు, కింది భాగంలో 2015 అని సంవత్సరం పేరు ఉంటుంది.