
రూ.500 నోట్లు వచ్చేశాయ్
న్యూఢిల్లీ: కొత్త రూ.500 నోట్లను సోమవారం ఢిల్లీ ప్రజలకు అందాయి. ఢిల్లీ ఏటీఎంలలో ఐదు వందల రూపాయల నోట్లు లభ్యమవుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రూ.100 నోట్లను ఏటీఎంలలో పెద్ద మొత్తంలో ఉంచడం వల్ల అవి త్వరగా అయిపోయాయి.
తాజాగా రూ.500 నోట్లతో ఒక్కో ఏటీఎం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలకు అవి అందుబాటులో ఉంటున్నాయి. కాగా, సోమ,మంగళవారాల్లో దేశమంతటా రూ.500 నోట్లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే.