రూ.22.5 కోట్లతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ పరారీ | In Delhi's Biggest Heist, ATM Cash Van Driver Flees With Rs. 22.5 Crore | Sakshi
Sakshi News home page

రూ.22.5 కోట్లతో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ పరారీ

Published Fri, Nov 27 2015 7:56 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

నిందితుడు వదిలేసి వెళ్లిన ఏటీఎం నగదు వాహనం - Sakshi

నిందితుడు వదిలేసి వెళ్లిన ఏటీఎం నగదు వాహనం

న్యూఢిల్లీ : ఏటీఎం సెంటర్లలో నగదు నింపేందుకు రూ.22.5 కోట్లతో బయలుదేరిన వాహనం.. పత్తాలేకుండా పోయింది. సంస్థ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. డ్రైవరే దొంగతనానికి పాల్పడ్డట్లు నిర్ధారణకు వచ్చారు. దేశరాజధానిలో గురువారం సంచలనం రేపిన ఈ సంఘటనలో నిందితుడు ప్రదీప్ శుక్లాను ఎట్టకేలకు పోలీసులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

 

దక్షిణ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని ఏటీఎంలలో నగదు నింపేందుకు డీఎల్ 1ఎల్కే 9189 వాహనంలో బయలుదేరిన డ్రైవర్ ప్రదీప్ శుక్లా,గోవింద్ పూర్ వద్ద వాహనాన్ని దారిమళ్లించిన కోట్ల రూపాయలతో పరారయ్యడు. సెక్యూరిటీ గార్డ్ వినయ్ పటేల్ సంబంధిత బ్రాంచ్ అధికారులకు తెలియజేశాడు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గంట తర్వాత ఓ పెట్రోల్ బంక్ వద్ద వ్యాన్ను కనుగొన్నారు. అయితే అందులో డబ్బు మాత్రంలేదు. దీంతో బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు డ్రైవర్ ఇంటితోపాటు అతడికి సంబంధించిన అన్ని చోట్ల మాటు వేశారు. చివరికి శుక్రవారం ఉదయం డ్రైవర్ పట్టుబడ్డాడు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement