ఆర్‌బీఐకొత్త నాణేలు త్వరలో.. మరి పాతవి
ముంబై: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా త్వరలో కొత్త నాణేలను పంపిణీ చేయనున్నది. త్వరలోనే రూ. 5,10 కాయిన్లను చలామణి లోకి తీసుకు రానుంది. భారత జాతీయ పురావస్తుశాఖ ఏర్పడి 125 సం.రాలు అయిన సందర్భంగా కొత్తగా రూ.10 విలువైన నాణేలను చలామణిలోకి తీసుకురావాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. అలహాబాద్ హైకోర్టు 150 వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త రూ.5 నాణేలను ప్రవేశపెట్టనున్నట్టు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ముఖ‍్యంగా కొత్త రూ.10 నాణేనికి వెనుక వైపు నేషనల్ అర్చీవ్స్ బిల్డింగ్ చిత్రం, దానికింద 125 ఇయర్స్ అన్న అక్షరాలు వస్తాయని కేంద్ర బ్యాంక్ తెలిపింది. అలాగే 125 వ వార్షికోత్సవ వేడుక చిహ్నాన్ని కూడా జోడిస్తున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. అలాగే కొత్త రూ.5 నాణేలపై అలహాబాద్ హైకోర్టు భవనం ఫోటోతోపాటు 1866-2016 ఆంగ్ల సంఖ్యలు ఈ బొమ్మ కింద వచ్చేలా రూపొందించనున్నట్లు తెలిపింది.
ముఖ్యంగా రూ. 5, 10 పాత నాణేలు కూడా చట్టపరంగా చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది.