
ముంబై : దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా మరో కొత్త బ్యాంకు నోట్లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. త్వరలోనే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త రూ.50 నోట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతున్నట్టు రిజర్వు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. మహాత్మాగాంధీ(కొత్త) సిరీస్‌లో వీటిని ఆర్బీఐ విడుదల చేయబోతున్నట్టు పేర్కొంది. ఈ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుందని కూడా తెలిపింది. ఈ బ్యాంకు నోట్లపై ఒకవైపు గాంధీ బొమ్మ, మరోవైపు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథోత్సవం బొమ్మ ఉంటుందని తెలిసింది. ఈ నోట్ల బేస్ కలర్ ఫ్లోర్‌సెంట్ బ్లూ. ఈ బ్యాంకు నోటు పరిణామం 66 mm x 135 mm. కొత్తగా రూ.20, రూ.50 నోట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు రిజర్వు బ్యాంకు గతేడాది డిసెంబర్‌లోనే తెలిపింది.