పోస్ట్ ఆఫీసుల్లో కొత్త నోట్లు సిద్ధం | New Rs.500 and Rs.2000 notes have been made available in 1.55L post offices: Eco Affairs Secy | Sakshi
Sakshi News home page

పోస్ట్ ఆఫీసుల్లో కొత్త నోట్లు సిద్ధం

Published Wed, Nov 23 2016 10:55 AM | Last Updated on Wed, Oct 17 2018 5:00 PM

పోస్ట్ ఆఫీసుల్లో కొత్త నోట్లు సిద్ధం - Sakshi

పోస్ట్ ఆఫీసుల్లో కొత్త నోట్లు సిద్ధం

న్యూఢిల్లీ:  డిమానిటైజేషన్ క్రమంలో  ఆర్థిక శాఖ  తీసుకుంటున్న ఉపశమన చర్యలను  కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ వివరించారు. బుధవారం  ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన  దాదాపు లక్షా  55 వేల పోస్ట్ ఆఫీసుల్లో నగదు అందుబాటులో ఉందని తెలిపారు.  కొత్త కరెన్సీ నోట్లు రూ500, రూ.1000 నోట్లు అందుబాటులో ఉంచినట్టు ప్రకటించారు.  జిల్లా కేంద్రాలల్లో  సహకార బ్యాంకుల్లో నగదునిల్వపై ఆర్ బీఐకి ఆదేశిలిచ్చామని తెలిపారు. జిల్లా సహకార బ్యాంకుల్లో  నాబార్దు 21 వేల కోట్లు సహకార బ్యాంకులకు పంపామని పేర్కొన్నారు.  ఈ క్రమంలో ఆర్బీఐ పరిస్థితిని సమీక్షిస్తోందని తెలిపారు.  ముఖ్యంగా రబీసీజన్ లో  రైతులకు ఇబ్బందు ల్లేకుండా ఈ చర్యలు తీసుకున్నామని  ఆయన  ప్రకటించారు. నాబార్డ్  తదితర బ్యాంకులతో  ఆర్థిక శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిందని  వివరించారు.  రుపే చార్జీల రద్దుతో బాటు  డెబిట్ కార్డులపై  అన్ని చార్జీలను కూడా  డిశెంబర్ 31  వరకు పూర్తిగా రద్దుచేసినట్టు   గుర్తుచేశారు. 

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.  ప్రభుత్వ ఉద్యోగులందరూ  డిజిటల్   బ్యాంకింగ్ ను ఉపయోగించుకోవాలని,  ఇంటర్నెట్ పేమెంట్ల ద్వారా చెల్లింపులు చేయాలని కోరినట్టు తెలిపారు. ఈ వ్యాలెట్ల   నగదు పరిమితిని పెంచినట్టు  ప్రకటించిన శక్తికాంత దాస్   ఈ సందర్భంగా   పవర్ పాయింట్  ప్రజంటేషన్  ద్వారా
 ఈ పే మెంట్లపై  వివరించారు.

అలాగే పరిస్థితిని  డీల్ చేయడంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు బాగా  పనిచేశాయని శక్తికాంత దాస్ ప్రశంసించారు.  ప్రయివేట్ బ్యాంకులు కూడా తగిన సేవలు అందించాయని కొనియాడారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement