
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ నిపుణులు, విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రెపో రేటును 50 బీపీఎస్ పాయింట్లు మేర పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎంపీసీ కమిటీ ఏకగగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. తాజా పెంపుతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) 5.15 శాతానికి సర్దుబాటు చేసింది.
జీడీపీ వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేశారు. ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీపీఐ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని, 2023-24 ఆర్థిక సంవత్సరానికి 5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు సహజంగానే ప్రభావితమవుతోందని తెలిపారు. ఆర్థికవ్యవస్థ అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేశారు. త్వరలోనే వంటనూనెలు దిగి రానున్నాయని ఆయన చెప్పారు.
కాగా గత మూడు నెలల్లో రెపో రేటును పెంచడం ఇది వరుసగా మూడోసారి. గవర్నర్ శక్తికాంత దాస్ నేృత్వత్వంలో మూడు రోజుల సమావేశాల అనంతరం కమిటీ పాలసీ విధానాన్ని ప్రకటించింది. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ రేటు పెంపునకే మొగ్గు చూపింది.
Comments
Please login to add a commentAdd a comment