Tata Sky
-
ఎయిర్టెల్ భారీ వ్యూహం.. టాటాగ్రూప్ కంపెనీపై కన్ను!
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన డిజిటల్ టెలివిజన్ విభాగాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) సర్వీస్ ప్రొవైడర్ టాటా ప్లే (గతంలో టాటాస్కై)ని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఎయిర్టెల్ ప్రస్తుతం టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది.ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ఎఫ్‌టీఏ సేవల ఆవిర్భావం కారణంగా వృద్ధి సమస్యలను ఎదుర్కొంటున్న డిజిటల్ టెలివిజన్ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగా టాటాప్లేని కొనుగోలు చేయడానికి ఎయిర్టెల్ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. 2017లో టాటా కన్స్యూమర్ మొబిలిటీ వ్యాపారాన్ని భారతీ ఎయిర్టెల్ కొనుగోలు చేసిన తర్వాత రెండు కంపెనీల మధ్య ఇది రెండో ఒప్పందం కానుంది. ఈ ఒప్పదం కుదిరి టాటా ప్లేను ఎయిర్టెల్ కొనుగోలు చేస్తే టాటా తన కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాల పూర్తిగా వైదొలుగుతుంది.టాటా ప్లే ప్రస్తుతం డీటీహెచ్ విభాగంలో 20.77 మిలియన్ల సబ్స్క్రైబర్లు, 32.7 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉంది. కానీ ఆర్థిక పరంగా నష్టాల్లో నడుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ.353.8 కోట్లుగా ఉంది. టాటా ప్లే కొనుగోలుతో ఎయిర్టెల్ కస్టమర్ బేస్ పెరుగుతుందని, అదే సమయంలో జియో అందిస్తున్న ఆఫర్లతో పోటీపడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. -
ALL OTT APPS: కేవలం రూ.299 లకే
-
టాటా ప్లే(స్కై) కస్టమర్లకు శుభవార్త..!
దేశంలోని అతిపెద్ద డైరెక్ట్ టూ హోమ్(డీటీహెచ్) టీవీ కంపెనీ టాటా ప్లే తన చందాదారులకు మంచి శుభవార్త తెలిపింది. తన చందాదారుల ఛానల్ ప్యాక్‌ల రేట్లను సగానికి మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఓటీటీ కంటెంట్ రాజ్యం ఎలుతున్న ఈ కాలంలో.. ఛానల్ ప్యాక్‌ల రేట్లను తగ్గించిన కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇతర సర్వీసు ప్రొవైడర్లు రేట్లను పెంచుతూ తమ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్'ను పెంచుకోవాలని భావిస్తున్నాయి. ఈ సమయంలో టాటా ప్లే మంచి నిర్ణయం తీసుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఛానల్ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ఆ కంపెనీ యూసేజ్ హిస్టరీని బట్టి నిర్ణయిస్తుంది. వినియోగదారులకు కావాల్సిన ఛానల్స్‌ను మాత్రమే చూసుకునేలా ధరల తగ్గింపు చేపడుతోంది. టాటా ప్లే తీసుకున్న ఈ నిర్ణయంతో కస్టమర్లకు నెలవారీ రూ.30 నుంచి రూ.100 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టాటా ప్లేకు 19 మిలియన్ల మంది యాక్టివ్ చందాదారులు ఉన్నారు. కాగా, టాటా స్కై సంస్థ పేరును ఇటీవలే టాటా ప్లేగా మార్చింది. జనవరి 27, 2022 నుంచి టాటా స్కై కొత్త పేరు టాటా ప్లే పేరు అందుబాటులోకి వచ్చింది. టీవీ చానెళ్లతో పాటు ఓటీటీ సర్వీసులను విస్తృతంగా అందిస్తోంది. (చదవండి: ఇక జీఎస్టీ మూడు శ్లాబులేనా.. వాటి ధరలు పెరగనున్నాయా?) -
కొత్త పేరుతో సరికొత్తగా రానున్న టాటాస్కై..! ఓటీటీ సేవలు ఇంకా..!
భారత్‌లో అతి పెద్ద డీటీహెచ్ సేవలను అందిస్తోన్న టాటాస్కై పేరు మారింది. ఇకపై టాటా స్కైను టాటా ప్లే(Tata Play)గా పిలవనున్నారు. దీంతో పాటుగా ఓటీటీ సర్వీసుల ప్రధాన ప్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త సర్వీసులోకి..! ఇప్పటికే టాటా స్కైను వాడుతున్న యూజర్లు కొత్త సర్వీసులకు చేంజ్ కానున్నారు. టాట్ స్కై ఇంటర్ఫేస్లో పూర్తిగా భారీ మార్పులు రానున్నాయి. జనవరి 27 నుంచి టాటా స్కై కొత్త పేరు టాటా ప్లేగా కనిపించనుంది. పలు ఓటీటీ సేవలను కూడా యూజర్లకు అందించనుంది. తొలిసారిగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సేవలను టాటా ప్లే యూజర్లు పొందనున్నారు. కాంబో ప్యాక్స్..! సాధారణ టీవీ ఛానళ్లతో పాటుగా ఓటీటీ సేవలను అందించేందుకుగాను టాటా ప్లే సరికొత్త కాంబో ప్యాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. టాటా ప్లే బింగే (Tata Play Binge) మొత్తంగా 13 ప్రధాన ఓటీటీ యాప్స్‌కు సపోర్టు చేయనుంది. అలాగే ఒకేసారి పేమెంట్స్, సబ్స్క్రిప్షన్ పొందేలా ఇంటర్ఫేస్ను ఇస్తోంది టాటా ప్లే. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్రధాన ఓటీటీ సేవలను పొందవచ్చును. డీటీహెచ్ సేవలతో పాటుగా బ్రాండ్‌బ్యాండ్ నెట్వర్క్ పేరును కూడా టాటా ప్లే ఫైబర్ (Tata Play Fiber)గా మార్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. టాటా ప్లే అనేది టాటా సన్స్, ది వాల్ట్ డిస్నీ కంపెనీల సంయుక్త వెంచర్. దేశవ్యాప్తంగా 23 మిలియన్ల కుటుంబాలకు టాటా ప్లే సర్వీస్ విస్తరించి ఉంది. చదవండి: తలనొప్పిగా మారనున్న రష్యా-ఉక్రెయిన్ టెన్షన్..! ఇంధన ధరలు రయ్ అంటూ..! -
డిష్ టీవీ ఫర్ సేల్..! పోటీలో ప్రధాన కంపెనీలు..!
లోన్ రికవరీలో భాగంగా డిష్ టీవీలో దక్కిన 25.6 శాతం వాటాలను యస్ బ్యాంకు అమ్మేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకుగాను యస్ బ్యాంకు దిగ్గజ శాటిలైట్ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. పోటీలో టాటా స్కై, భారతి ఎయిర్టెల్..! డిష్ టీవీను దక్కించుకునేందుకు దిగ్గజ శాటిలైట్ సంస్థలు టాటాస్కై, భారతీ ఎయిర్టెల్ ముందున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై ఇరు కంపెనీలు స్పందించలేదు. డిష్ టీవీ, యస్ బ్యాంకుల మధ్య గత కొద్ది రోజల నుంచి అనిశ్చితి నెలకొంది. కంపెనీపై బాధ్యతలు తమకే ఉంటాయని ఇరు వర్గాలు వాదనలు చేస్తున్నాయి. వారికే బెనిఫిట్..! డిష్ టీవీ వ్యవహారాలను కంపెనీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ఫ్యామిలీ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటుంది. వీరికి కంపెనీలో ఆరు శాతం వాటాలు కల్గి ఉన్నారు. ఒకవేళ యస్‌బ్యాంకు డిష్‌టీవీ వాటాలను టాటాస్కై, లేదా ఎయిర్టెల్ దక్కించుకుంటే ఆయా శాటిలైట్ టీవీ కంపెనీలు వాటా గణనీయంగా పెరగనుంది. శాటిలైట్ డిష్ టీవీ మార్కెట్లో 88 శాతంతో టాటాస్కై మొదటిస్థానంలో ఉంది. ఎయిర్టెల్, డిష్ టీవీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో డిష్ టీవీ ఆదాయం రూ.14 కోట్లుగా నమోదైంది. అలాగే రూ.67 కోట్ల నష్టాలను చవిచూసింది. డిష్ టీవీ మార్కెట్ విలువ రూ.8,268 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: 500 కోట్ల పరిహారం అడిగాడు.. ఆపై భార్యతో కలిసి ఫోన్లో బండబూతులు తిట్టాడు! -
టాటా స్కై యూజర్లకు షాక్ : సోని ఛానల్స్ క్లోజ్
ముంబై : 1.6 కోట్ల టాటా స్కై సబ్స్క్రైబర్లకు షాకింగ్ న్యూస్. మీకు ఎంతో ఇష్టమైన, నిరంతరం చూసే సోని పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా(ఎస్పీఎన్)కు చెందిన 32 ఛానల్స్‌ను టాటా స్కై తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. అంతేకాక ఇండియా టుడే నెట్‌వర్క్‌కు చెందిన మూడు ఛానల్స్‌ను కూడా తన ప్లాట్‌ఫామ్‌ను నుంచి తొలగిస్తున్నట్టు టాటా స్కై వెల్లడించింది. ధరల సమస్యలతో ఈ ఛానల్స్‌ను తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగిస్తున్నట్టు టాటా స్కై ప్రకటించింది. టాటా స్కై ఆపివేసిన ఛానల్స్ల్లో పాపులర్ టీవీ ఛానల్స్ సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, ఎస్‌ఏబీ, మ్యాక్స్, ఏఎక్స్‌ఎన్, సోని పిక్స్, ఆజ్ తక్, ఇండియా టుడే ఉన్నాయి. అక్టోబర్ 1 నుంచి టాటా స్కైలో ఈ ఛానల్స్‌ను ప్రసారం చేయడం లేదు. ఈ విషయం తెలిసిన కొంతమంది సబ్స్క్రైబర్లు ఇప్పటికే టాటా స్కైపై మండిపడుతున్నారు. ట్విటర్, ఫేస్బుక్ వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు. టాటా స్కై నిర్ణయం దురదృష్టకరమైనదని సోని పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా ప్రకటించింది. టాటా స్కైతో సోని పిక్చర్స్‌కు ఉన్న మూడేళ్ల డిస్ట్రిబ్యూషన్ డీల్ జూలై 31తో ముగిసింది. కొత్త డీల్‌పై ఇరు పార్టీలు చర్చించుకోవాల్సి ఉంది. కానీ ధరల విషయంలో ఈ రెండింటికీ పొంతన కుదరలేదు. మూడేళ్ల క్రితం టాటా స్కై సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆ సంఖ్య 1.6 కోటికి పైగా చేరింది. టాటా స్కై తమకు ఎక్కువ రెవెన్యూ ఇవ్వాలని సోని పిక్చర్స్ డిమాండ్ చేసింది. దానికి టాటా స్కై ఆమోదించలేదు. ‘సోని పిక్చర్స్‌తో ఉన్న వాణిజ్య చర్చలు విఫలమయ్యాయి. ధరలు పెంచాలని వారు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము కొన్ని ఛానల్స్‌ను తొలగించాలని నిర్ణయించాం. సబ్స్క్రైబర్లు అర్థం చేసుకోవాలి’ టాటా స్కై ఎండీ హరిత్ నాగ్‌పాల్ కోరారు. అయితే సోని పిక్చర్స్ మాత్రం టాటా స్కైపై తీవ్ర ఆరోపణలు చేసింది. వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టు టాటా స్కై వ్యవహరించడం లేదని, వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ను, లైవ్ స్పోర్టింగ్ యాక్షన్‌ను చూసే అవకాశాన్ని యూజర్లకు టాటా స్కై ఇవ్వడం లేదని సోని పిక్చర్స్ అధికారి ప్రతినిధి ఆరోపించారు. తమ ఛానల్స్‌ను చూడాలనుకునే వారు, తమకు సెపరేటుగా మిస్డ్ కాల్ ఇవ్వాలని తెలిపింది. అయితే మిస్డ్ కాల్ ఇవ్వాలంటూ.. ఇచ్చిన నెంబర్ కలువడం లేదు. కస్టమర్ కేర్ సర్వీసు క్రాష్ అయింది. దీంతో సబ్స్క్రైబర్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. అయితే 10 సోని పిక్చర్స్ ఛానల్స్‌ను మాత్రం టాటా స్కై అలానే ఉంచింది. టాటా స్కై తన ప్లాట్‌ఫామ్‌పై తొలగించకుండా ఉంచిన ఛానల్స్ల్లో ఎస్ఈటీ, ఎస్ఈటీ హెచ్డీ, సోని ఎస్‌ఏబీ, మ్యాక్స్, సోని సిక్స్, సోని టెన్, టెన్ 1 హెచ్డీ, సోని టెన్ 2 హెచ్డీ, సోని టెన్ 3, పిక్స్ హెచ్డీ, వన్ ఇండియా టుడే ఛానల్(ఆజ్ తక్) ఉన్నాయి. -
టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సేవలు: ఆఫర్లు, ప్లాన్లు ఇవే!
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో గిగాఫైబర్ సేవలు ప్రజల్లోకి ఆవిష్కరిస్తున్న తరుణంలో, డీటీహెచ్ సర్వీసుల సంస్థ టాటా స్కై దానికి పోటీగా వచ్చేసింది. టాటా స్కై కూడా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను దేశవ్యాప్తంగా ఉన్న 12 నగరాల్లో లాంచ్ చేసింది. న్యూఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ముంబై, థానే, పుణే, అహ్మదాబాద్, మిరా భాయందర్, భోపాల్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఒక నెల, మూడు నెలలు, ఐదు నెలలు, తొమ్మిది నెలలు, 12 నెలల పాటు వాలిడిటీతో ఈ సేవలు మార్కెట్లోకి వచ్చాయి. ఒక నెల టారిఫ్ ప్లాన్ 999 రూపాయలతో ప్రారంభమైంది. దీని కింద 5ఎంబీపీఎస్ స్పీడులో అపరిమిత డేటాను అందించనుంది. 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్ డేటా స్పీడులో సబ్స్క్రైబర్లకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి యూజర్‌కు కేటాయించిన అలవెన్స్ పడిపోతే, స్పీడ్ 1ఎంబీపీఎస్‌కు పడిపోనుంది. టాటా స్కై ఒక నెల ప్లాన్.. ఒక నెల డేటా ప్లాన్ 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడులో 999 రూపాయలుకు, 1150 రూపాయలకు, 1,500 రూపాయలకు, 1,800 రూపాయలకు, 2,500 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్ చేయనున్నాయి. అయితే ఇన్స్టాలేషన్ ఫీజు కింద సబ్స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.999కు, రూ.1,250కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. టాటా స్కై మూడు నెలల ప్లాన్.. మూడు నెలల డేటా ప్లాన్ 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడులో 2,997 రూపాయలుకు, 3,450 రూపాయలకు, 4,500 రూపాయలకు, 5,400 రూపాయలకు, 7,500 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్ చేయనున్నాయి. అయితే ఇన్స్టాలేషన్ ఫీజు కింద సబ్స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.2,997కు, రూ.3,750కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. టాటా స్కై 12 నెలల ప్లాన్.. 12 నెలల డేటా ప్లాన్ 5ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్, 50ఎంబీపీఎస్, 100 ఎంబీపీఎస్ స్పీడులో 11,988 రూపాయలుకు, 13,800 రూపాయలకు, 18,000 రూపాయలకు, 21,600 రూపాయలకు, 30,000 రూపాయలకు అందుబాటులో ఉంది. అన్ని ప్లాన్లు అపరిమిత డేటాను ఆఫర్ చేయనున్నాయి. అయితే ఇన్స్టాలేషన్ ఫీజు కింద సబ్స్క్రైబర్లు 1200 రూపాయలను చెల్లించాల్సి ఉంది. దీనిపై సబ్స్క్రైబర్లకు ఉచితంగా వై-ఫై రూటర్ లభించనుంది. 60జీబీ, 125జీబీ పరిమితిలో రూ.11,988కు, రూ.15,000కు రెండు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఐదు నెలలు, తొమ్మిది నెలల వాలిడిటీతో మరో రెండు ప్లాన్లు ఉన్నాయి. -
టాటా స్కై నుంచి... కామెడీ సర్వీస్
హైదరాబాద్: ప్రముఖ డెరైక్ట్ టు హోమ్(డీటీహెచ్) కంపెనీ టాటా స్కై తన వినియోగదారుల కోసం టాటా స్కై కామెడీ పేరుతో కొత్త సర్వీస్‌ను అందిస్తోంది. భారత్‌లో డీటీహెచ్‌లో ఇదే తొలి ఇంటరాక్టివ్ సర్వీస్ కానున్నదని టాటా స్కై కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ఫార్మాట్ల హిందీ కామెడీని ఈ టాటా స్కై కామెడీ సర్వీస్‌తో పొందవచ్చని ఈ సర్వీస్‌ను ప్రారంభించిన టాటా స్కై చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ పల్లవి పురి చెప్పారు. నుక్కడ్, యో జో హై జిందగి, తదితర క్లాసిక్ కామెడీ టీవీ షోలను, సినిమా పేరడీలను, నకిలీ న్యూస్ షోలు, తదితర విభిన్నమైన కామెడీ కంటెంట్‌ను వీక్షకులు ఆస్వాదించవచ్చని వివరించారు. రోజంతా ఎలాంటి ప్రకటనలు లేకుండా వచ్చే ఈ టాటా స్కై కామెడీకి షేమారూ ఎంటర్టైన్మెంట్ అందిస్తోందని వివరించారు. -
కోటి కొత్త డీటీహెచ్ కస్టమర్లు
- ఈ ఏడాది డీటీహెచ్ రంగం జోరు.. - ప్రతి ముగ్గురు వినియోగదార్లలో ఒకరు టాటా స్కై నుంచే... - కంపెనీ సీఎస్‌వో సలీమ్ షేక్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డెరైక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో 2015-16లో కొత్తగా ఒక కోటి మంది కస్టమర్లు వచ్చి చేరతారని టాటా స్కై అంచనా వేస్తోంది. నాణ్యమైన దృశ్యం, ఉత్తమ సర్వీసు, ఎంపిక చేసుకోవడానికి విభిన్నమైన ప్యాక్‌ల కారణంగా డీటీహెచ్‌ను ఎంచుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని టాటా స్కై చీఫ్ సేల్స్ ఆఫీసర్ సలీమ్ షేక్ సోమవారం తెలిపారు. ‘దేశవ్యాప్తంగా 14 కోట్ల టీవీ గృహాలున్నాయి. కేబుల్ చందాదారులు 8-8.5 కోట్లు, డీటీహెచ్ చందాదారులు 4.1 కోట్ల మంది ఉన్నారు. కేబుల్ నుంచి డీటీహెచ్‌కు మళ్లుతున్నవారి శాతం ఏటా 6-8 శాతంగా ఉంది. డిజిటైజేషన్‌కు అనుగుణంగా ఇది మరింత పెరుగుతుంది’ అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు పరిశ్రమ 10-12% న మోదు చేస్తే, టాటా స్కై 20% అంచనా వేస్తోందన్నారు. కొత్త కస్టమర్లలో.. డీటీహెచ్ రంగంలో కొత్తగా వచ్చి చేరుతున్న కస్టమర్లలో ముగ్గురిలో ఒకరు టాటా స్కై ఎంచుకుంటున్నారని సలీమ్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పట్టణాల్లో 40 శాతంపైగా మార్కెట్ వాటా సాధించామని చెప్పారు. ఇక కొత్త కస్టమర్లలో హెచ్డీ కోరుకునేవారు పరిశ్రమలో 15%కాగా, టాటా స్కై విషయంలో 40-45% ఉంటున్నారని తెలిపారు. సర్వీసింగ్‌కు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ, ఏపీలో అగ్రశ్రేణి కంపెనీగా నిలిచిన సందర్భంగా జరిగిన వేడుకలో బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్ బాబు పాల్గొన్నారు. -
టాటాస్కై నుంచి తొలి 4కే సెట్-టాప్ బాక్స్
ముంబై: త్వరలో క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డెరైక్ట్-టు-హోమ్(డీటీహెచ్) సేవల సంస్థ టాటాస్కై భారత్‌లో తొలి 4కే సెట్-టాప్ బాక్స్‌ను (ఎస్టీబీ) ఆవిష్కరించింది. ఈ తరహా ఎస్టీబీలు ప్రసారాలను మరింత నాణ్యతతో అందించగలవు. 4కే సెట్ టాప్ బాక్సుల ధర ప్రస్తుత కస్టమర్లకు రూ. 5,900కి, కొత్త కస్టమర్లకు రూ. 6,400కు లభించగలదని సంస్థ తెలిపింది. -
కొత్త సరకు
ఇక ఆండ్రాయిడ్ టీవీలు... మీ టీవీ స్క్రీన్‌పై నుంచి మిత్రులకు వాట్సప్ మెసేజ్ పంపాలనుకుంటున్నారా? అయితే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే సరికొత్త ఎల్ఈడీ టీవీలు మీ కోసమే! దేశీయ కంపెనీ అరైజ్ ఈ మేరకు సరికొత్త టీవీ శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. 32 అంగుళాల నుంచి 84 అంగుళాల సైజు వరకూ ఉన్న ఈ టెలివిజన్ల ధరలు రూ.35 వేల నుంచి రూ.రెండు లక్షల మధ్య ఉంటాయి. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టెలివిజన్ల ద్వారా వెబ్బ్రౌజింగ్తోపాటు, వైఫై, హోంషేరింగ్ వంటివి చేసుకోవచ్చు. 3 హెచ్డీఎంపై పోర్టులతోపాటు, యూఎస్బీ, ఎస్డీ కార్డు మెమరీకి ఏర్పాట్లు ఉన్నాయి దీంట్లో. మొబైల్ హై డెఫినిషన్ లింక్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లను నేరుగా టీవీతో అనుసంధానించుకో వచ్చు. టెలివిజన్‌తోపాటు క్వెర్టీ కీబోర్డు, ఆరు ఆక్సిస్లు ఉన్న జాయ్‌స్టిక్ కూడా లభిస్తాయి కాబట్టి గేమింగ్, వెబ్సర్ఫింగ్లలో వినూత్న అనుభూతి పొందవచ్చు. నమో పేరుతో యాంటీవైరస్ సాఫ్ట్వేర్... ఇన్నోవేజియన్ అనే దేశీ ఐటీ సంస్థ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో ఓ ఉచిత యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. మాల్వేర్లు, వైరస్ అటాక్‌ల నుంచి పీసీలను రక్షించేందుకు ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ వినియోగంలో దేశం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నప్పటికీ చాలా తక్కువమంది లెసైన్స్డ్ యాంటీవైరస్‌ను వాడతారని అంచనా. ట్రయల్ వెర్షన్లను పదేపదే ఇన్స్టాల్ చేసుకోవడమూ ఎక్కువ. దాదాపు 57 శాతం పీసీలకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లూ లేవని, ఒకవేళ ఉన్నా అవి గుర్తుతెలియని అప్లికేషన్లు మాత్రమేనని నిపుణులు అంటున్నారు. అందువల్లనే బేసిక్ ప్రొటెక్షన్‌ను దృష్టిలో ఉంచుకుని తాము నమో యాంటీవైరస్‌ను అభివృద్ధి చేశామని అంటోంది కంపెనీ. రియల్‌టైమ్ డిటెక్షన్, ఇంటెలిజెంట్ స్కానింగ్ వంటి ఫీచర్లు ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఎక్కువ మెమరీని కూడా ఆక్రమించదని కంపెనీ తెలిపింది. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్... సామ్సంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీట్యాబ్ 4.7 వెర్షన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ శ్రేణిలో ఇప్పటికే 8, 10.1 అంగుళాల ట్యాబ్లెట్లు అందుబాటులో ఉండగా తాజాగా ఏడు అంగుళాల స్క్రీన్సైజును పరిచయం చేసింది ఈ కంపెనీ. ధర రూ.17825. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వెబ్సైట్ల ద్వారా అందుబాటులో ఉన్న ఈ సరికొత్త ట్యాబ్లెట్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో పనిచేస్తుంది. ప్రాసెసర్ వేగం 1.2 గిగాహెర్ట్జ్ కాగా, నాలుగు కోర్లు ఉంటాయి. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 3 ఎంపీకాగా, వీడియోకాలింగ్ కెమెరా 1.3 ఎంపీ రెజల్యూషన్‌తో ఉంటుంది. స్క్రీన్ డిస్ప్లే రెజల్యూషన్ 1280 బై 800 పిక్సెల్స్. ర్యామ్ 1.5 జీబీ, ప్రధాన మెమరీ 8 జీబీలు. ఎస్డీ కార్డు ద్వారా మరింత మెమరీని ఏర్పాటు చేసుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్. ఇక పీసీల్లోనూ టాటాస్కై... పీసీలు, టెలివిజన్ల మధ్య అంతరం చెరిగిపోతోందనేందుకు ఇదో తార్కాణం. టెలివిజన్ కార్యక్రమాల రికార్డింగ్‌లు, లైవ్ స్ట్రీమింగ్ కోసం ఎన్నో వెబ్సైట్లు అందుబాటులో ఉన్నప్పటికీ తాజాగా ప్రముఖ దేశీయ సంస్థ టాటాస్కై... పీసీ, ల్యాప్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా ఎవరీవేర్టీవీ పేరుతో ఒక అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీస్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ఫోన్లలోనూ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ అప్లికేషన్‌ను పీసీలపై డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే సోనీ సిక్స్ టీవీ ఛానల్ ద్వారా ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలను చూడవచ్చు. ఎవరీవేర్ టీవీలో లైవ్ టీవీ, మునుపటి ఐదు రోజుల కార్యక్రమాలను చూసేందుకు క్యాచప్ టీవీ, సినిమాలతోపాటు వేర్వేరు కార్యక్రమాలను మీరు చూడాలనుకున్న ప్పుడు చూసేందుకు వీడియో ఆన్ డిమాండ్ వంటి మూడు విభాగాలు ఉన్నాయి.