భారత్‌లో అతి పెద్ద డీటీహెచ్ సేవలను అందిస్తోన్న టాటాస్కై పేరు మారింది. ఇకపై టాటా స్కైను టాటా ప్లే(Tata Play)గా పిలవనున్నారు. దీంతో పాటుగా ఓటీటీ సర్వీసుల ప్రధాన ప్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
కొత్త సర్వీసులోకి..!
ఇప్పటికే టాటా స్కైను వాడుతున్న యూజర్లు కొత్త సర్వీసులకు చేంజ్ కానున్నారు. టాట్ స్కై ఇంటర్ఫేస్‌లో పూర్తిగా భారీ మార్పులు రానున్నాయి. జనవరి 27 నుంచి టాటా స్కై కొత్త పేరు టాటా ప్లేగా కనిపించనుంది. పలు ఓటీటీ సేవలను కూడా యూజర్లకు అందించనుంది. తొలిసారిగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సేవలను టాటా ప్లే యూజర్లు పొందనున్నారు.
కాంబో ప్యాక్స్..!
సాధారణ టీవీ ఛానళ్లతో పాటుగా ఓటీటీ సేవలను అందించేందుకుగాను టాటా ప్లే సరికొత్త కాంబో ప్యాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. టాటా ప్లే బింగే (Tata Play Binge) మొత్తంగా 13 ప్రధాన ఓటీటీ యాప్స్‌కు సపోర్టు చేయనుంది. అలాగే ఒకేసారి పేమెంట్స్, సబ్‌స్క్రిప్షన్ పొందేలా ఇంటర్ఫేస్‌ను ఇస్తోంది టాటా ప్లే. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్రధాన ఓటీటీ సేవలను పొందవచ్చును. డీటీహెచ్ సేవలతో పాటుగా బ్రాండ్‌బ్యాండ్ నెట్‌వర్క్ పేరును కూడా టాటా ప్లే ఫైబర్ (Tata Play Fiber)గా మార్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. టాటా ప్లే అనేది టాటా సన్స్, ది వాల్ట్ డిస్నీ కంపెనీల సంయుక్త వెంచర్. దేశవ్యాప్తంగా 23 మిలియన్ల కుటుంబాలకు టాటా ప్లే సర్వీస్ విస్తరించి ఉంది.
చదవండి: తలనొప్పిగా మారనున్న రష్యా-ఉక్రెయిన్ టెన్షన్..! ఇంధన ధరలు రయ్ అంటూ..!
Comments
Please login to add a commentAdd a comment