10 నిమిషాల్లోనే అంబులెన్స్.. బ్లింకిట్ కొత్త సర్వీస్‌ | Blinkit launches new 10 minute ambulance service in Gurugram | Sakshi
Sakshi News home page

10 నిమిషాల్లోనే అంబులెన్స్.. బ్లింకిట్ కొత్త సర్వీస్‌

Published Thu, Jan 2 2025 6:29 PM | Last Updated on Thu, Jan 2 2025 7:13 PM

Blinkit launches new 10 minute ambulance service in Gurugram

క్విక్ కామర్స్ (Quick commerce) ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ (Blinkit) కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. 10 నిమిషాల అంబులెన్స్ (ambulance)సేవను గురుగ్రామ్ నగరంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అల్బిందర్ ధింద్సా తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

"మన నగరాల్లో వేగవంతమైన, విశ్వసనీయమైన అంబులెన్స్ కొరత సమస్యను పరిష్కరించడానికి మేము మొదటి అడుగు వేస్తున్నాము" అని ధిండ్సా పేర్కొన్నారు. గురుగ్రామ్ నగరంలో కంపెనీ ఈరోజు (జనవరి 2) నుండి ఐదు అంబులెన్స్‌లను ప్రారంభించిందని, మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ఆలోచన కూడా ఉందని ఆయన వెల్లడించారు.

“మొదటి ఐదు అంబులెన్స్‌లు గురుగ్రామ్‌లో రోడ్‌పైకి వస్తాయి. సర్వీస్‌ను మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేసినప్పుడు, బ్లింకిట్‌  యాప్ ద్వారా బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS) అంబులెన్స్‌ని బుక్ చేసుకునే ఎంపికను మీరు చూస్తారు" అని ధిండ్సా తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

బ్లింకిట్‌ అంబులెన్స్‌లలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED), స్ట్రెచర్, మానిటర్ వంటి పరికరాలతోపాటు అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని ధిండ్సా వివరించారు. ప్రతి అంబులెన్స్‌లో ఒక పారామెడిక్, సహాయకుడు, శిక్షణ పొందిన డ్రైవర్‌ ఉంటారని చెప్పుకొచ్చారు. ఇందులో తమకు లాభం ముఖ్యం కాదని, తక్కువ ధరకు ఈ సేవలు అందిస్తామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement