బ్లింకిట్ వంటి క్విక్‌కామర్స్ సంస్థలు చట్టాలను ఉల్లంఘించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. క్విక్ కామర్స్ (Quick commerce) ప్లాట్‌ఫారమ్ బ్లింకిట్ (Blinkit) ఇటీవల ‘10 నిమిషాల్లో అంబులెన్స్’ (ambulance)సేవను గురుగ్రామ్‌లో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అలాంటి సర్వీసులు ప్రారంభించాలనుకునే కంపెనీలకు మంత్రి సూచనలు చేశారు.
‘అంబులెన్స్ సేవలు అందించడం, ఔషధాలు వంటివి త్వరగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో బ్లింకిట్ కొత్త సర్వీసులు ప్రారంభించింది. అయితే సదరు సర్వీసులు అందించే క్రమంలో తప్పకుండా చట్టాలను, ప్రభుత్వ నియమాలను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనల ఉల్లంఘన జరగకూడదు. క్విక్ కామర్స్, ఇ-కామర్స్ సంస్థల వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని కిరాణాదారులు ఆందోళన చెందుతున్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. పోటీ నిబంధనల ఉల్లంఘన జరిగితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) చర్యలు తీసుకుంటుంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: ఈపీఎఫ్‌ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..
బ్లింకిట్ (Blinkit) కొత్త సర్వీస్‌ను ప్రారంభించిన సమయంలో కంపెనీ CEO అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘మన నగరాల్లో వేగవంతమైన, విశ్వసనీయమైన అంబులెన్స్ కొరత ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము మొదటి అడుగు వేస్తున్నాం. ప్రాథమికంగా గురుగ్రామ్‌లో ఐదు అంబులెన్స్‌లను ప్రారంభించాం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment