కాన్ బెర్రా: టాక్సీ అగ్రిగేటర్ ఉబెర్ తన వ్యాపారాన్ని మరింత స్తరించుకుంటోంది. ఈ ప్రణాళికలో భాగంగా ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ రాష్ట్రంలో తన కొత్త సర్వీసులను లాంచ్ చేసింది. ఉబెర్ ఎక్స్ ఎల్ పేరుతో టాక్సీ సర్వీసులను ప్రారంభించింది. ఆరుగురు ఒకేసారి ప్రయాణించేలా 30 శాతం చౌక ధరలతో రైడ్ షేరింగ్ సేవలను గురువారంనుంచి అందుబాటులోకి తెచ్చింది. అక్కడ ప్రస్తుతం అందుబాటులో అక్కడి మాక్సీ- టాక్సీలకంటే తక్కవ రేటుకే ఈ సర్వీసులను అందిస్తున్నట్టు ప్రకటించింది.
అయితే ఉబెర్ రైడ్ షేరింగ్ సేవల్లో ఈ రాష్ట్రంలో ఈ మే లోఉబెర్ డ్రైవర్లకు 1,772 డాలర్ల వరకు జరిమానాలు పెంచడం తో పాటు, నిర్వాహకులకు17,718 డాలర్ల వరకు జరిమానాను అక్కడి ప్రభుత్వ అధికారులు విధించినట్టు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. రైడ్ షేరింగ్ సర్వీసెస్ పై రివ్యూ అధికారులు పెద్ద ఎత్తున ఫైన్ విధించిన తరువాత కూడా. ఉబెర్ డ్రైవర్లకు అసలు మర్యాద తెలియదని. అగౌరవంగా ప్రవర్తిస్తారని, వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలదని ఇటీవల అధికారి ఒకరు చెప్పారని పేర్కొంది.
దీనిపై స్పందించిన సంస్థ నిజానికి తాము ప్రభుత్వం, వారి సమీక్షల ఆధారంగా కలిసి పనిస్తున్నామని ఉబెర్ అధికారి ఒకరు తెలిపారు. అలాగే సురక్షితమైన,సరసమైన ధరల్లో తమ సేవలను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు.
ఆస్ట్రేలియాలో ఉబెర్ సర్వీసులు
Published Thu, Jun 23 2016 12:16 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement