ఆర్డర్ చేసిన నిముషాల్లోనే డెలివరీ చేసే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫుడీస్ కోసం అదిరిపోయే సర్వీస్ తీసుకువచ్చింది. జొమాటో ఎవిరిడే (Zomato Everyday) పేరుతో ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్‌ను అందిస్తుంది.
మార్కెట్లో జొమాటో ఎప్పటికప్పుడు తమ ఇన్‌స్టంట్ సర్వీస్‌ను రీమోడలింగ్ చేయడంలో భాగంగానే ఈ కొత్త సర్వీసుని అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో దీపేంద్ర గోయల్ తెలిపారు. ఈ సర్వీస్ కింద సరసమైన ధరలోనే హోమ్ స్టైల్ ఫుడ్ అందిస్తామన్నారు. 2022-23 క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించే సమయంలో ఈ కొత్త సర్వీస్ తీసుకువస్తామని తెలిపారు.
జొమాటో ఎవిరిడే సర్వీస్ ప్రారంభంలో గురుగావ్‌లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఫుడ్ పార్ట్‌నర్ హోమ్ చెఫ్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని తమ కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్ అందిస్తారు. కంపెనీ అందించే ఈ హోమ్ స్టైల్ మీల్స్ ప్రారంభ ధర కేవలం రూ. 89 మాత్రమే.
(ఇదీ చదవండి: ఎగబడి మరీ 'మారుతి ఈకో' కొంటున్న జనం.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్!)
జొమాటో సంస్థకు ప్రధాన ప్రత్యర్థి గతంలో స్విగ్గీ 2019 లో స్విగ్గీ డెయిలీ పేరుతో హోమ్ స్టైల్ ఫుడ్ సర్వీస్ ప్రారభించింది. అయితే అనుకున్నంత సక్సెస్ సాధిచకపోవడంతో 2020లో హోమ్ స్టైల్ ఫుడ్ సర్వీసులను నిలిపేసింది. అయితే ఇప్పుడు జొమాటో అలాంటి సర్వీసుని త్వరలోనే ప్రారంభిస్తుంది.
జొమాటో కంపెనీ తమ కస్టమర్ల కోసం ప్రారంభించే ఈ కొత్త సర్వీస్ ఎంత వరకు సక్సస్ సాధిస్తుందనేది త్వరలోనే తెలుస్తుంది, అంతే కాకుండా కంపెనీ డెలివరీ బాయ్స్ కోసం రెస్ట్ రూమ్స్ నిర్మిస్తున్నట్లు తెలిపింది. డెలివరీ బాయ్స్ ఈ రూమ్స్‌లో కొంత విశ్రాంతి తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment